Today Telugu News Updates
వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టనున్న టెన్నిస్ స్టార్ సానియా?

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నటిగా మారతారంటూ షోషల్ మీడియా లో ప్రచారం జోరుగా సాగుతోంది. సానియా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జాతీయ మీడియా వర్గాలు ద్వారా తెలుస్తుంది.
ఇక టెన్నిస్ ఆటకు పులిస్టాప్ పెట్టి సానియా ఇక యాక్టింగ్‌నే కెరీర్‌గా మార్చుకోబోతోందంటున్నారు. వెండితెర పైకి వస్తుందోలేదో తెలీదుగానీ , బుల్లితెరపై మాత్రం మెరవనుందట. ఎమ్ టీవీలో ప్రసారం కాబోతున్న `నిషేద్ ఎలోన్ టుగెదర్` సిరీస్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది . మొత్తం ఐదు ఎపిసోడ్‌లుగా ఇది ప్రసారం కాబోతోందట.
ఈ నెల చివరి నుంచి ఈ సిరీస్ ప్రజల ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది.