Today Telugu News Updates
ఢిల్లీలో చదువుకొనే తెలుగు విద్యార్థిని ఆత్మహత్య !

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కి చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని ఒక కాలేజ్ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతుంది. అనుకోకుండా వచ్చిపడిన ఈ కరోనా వల్ల ఆ అమ్మాయి కి ఎటువెళ్లలేని పరిస్థి ఉన్న టైం లో హాస్టల్ యాజమాన్యం తనని బలవంతంగా హాస్టల్ కాళీ చేయించడంతో మనస్తాపానికి గురి ఐ తన స్వగ్రామానికి వచ్చి తన ఆవేదనని పంచుకుంది.
అప్పటినుండి ఇంట్లోనే చదువు కొనసాగిస్తూ ఉన్న తరుణంలో, తన కాలేజ్ హాస్టల్ యాజమాన్యం వేధింపులను తలచుకొంటూ బాధపడేది. అనుకొంకుండా ఐశ్వర్య తన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని చనిపోయింది.
ఐశ్వర్య చనిపోవడానికి కారణం కాలేజ్ యజమాన్యమేనని తన తల్లిదండులు మీడియాకు తెలిపారు. ఆ కాలేజ్ యాజమాన్యం మీద తగిన చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు.