Real life stories

అనుమానం పెను భూతం! చివరకి … అభి చరిత రియల్ స్టోరీ

Real love stories in telugu:: ప్రేమ ఈ పదం వినడానికి ఆహ్లాదకరంగా అనుభవించడానికి అద్భుతంగా ఉంటుంది. అసలు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడ్డారంటే ఈ లోకాన్ని జయించే శక్తి ఉంటుందన్న నమ్మకం కలిగిస్తుంది. ఒకరి జీవితాన్ని ఆనందంలో ముంచాలన్నా బాధలో దించాలన్నా అది ఒక ప్రేమకే సాధ్యం. సగటు మనిషిలో మనం ఏనాడూ చూడని విశ్వరూపాలన్నీ మనకు కనువిందుచేస్తుంది ప్రేమ. ఒకరు ఇంకొకరి కోసం వారికీ వారు తెలియని రూపాలని మలుచుకునేలా చేస్తుంది. అదే ప్రేమ కొన్ని సార్లు మనిషిని మనిషి కాదు అని నిరూపిస్తుంది. కోపం ద్వేషం అనే గుణాల్ని తెలియని మనిషికి వాటిని పరిచయం ఉన్న పదాలుగా మార్చేస్తుంది.

Real love stories in telugu

ఇపుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే పైన చెప్పిన రుచులని అనుభవించిన ఒక ప్రేమ జంటని ఈరోజు పొద్దునే కలవటం జరిగింది.వారు వారి మధ్య సాగిన ప్రేమని ప్రేమ కాదని చెప్తుంటే నేను పొందిన అనుభూతిని మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను.

ప్రేమ జంట కోరిక మేరకు ఇపుడు నేను మీకు పరిచయం చేసే ప్రదేశాలు, వాళ్ళ పేర్లు అన్నీ కల్పితాలు.అయితే ఇక ప్రేమ జంట గురించి మీకు చెప్తాను.. 

కర్నూల్ జిల్లాలో ఒకటైన నంద్యాల్లో ఈ ప్రేమ జంట ప్రయాణం మొదలయింది. అభి మరియు చరిత మన ప్రేమజంట పేర్లు. అభి, చరిత ఒక యువ ప్రేమ జనతా ఒకరిని వదిలి ఇంకొకరు అర క్షణం కూడా ఉండలేరు. ఈ ప్రేమజంట ఓ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి మీకు వివరిస్తాను. వీరు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య పుట్టిన ప్రేమ ఇప్పటిది కాదు. 5 సంవత్సరాల క్రితం 10 వ తరగతి నుంచే మొదలయింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక సమస్య కూడా వీరి ప్రేమని తాకలేదు అనడం అతిశయోక్తి కాదు. కొన్ని కొన్ని సార్లు నిజమైన ప్రేమకి నిలువెత్తు రూపం అన్నట్లు కనువిందు చేస్తారు ఈ ప్రేమ జంట. 

Telugu love stores

అలా 6 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఇంతలో కాలేజీలో ఎగ్జామ్స్ , క్యాంపస్ ఇంటర్వూస్ హడావిడి హడావిడిగా కాలేజీ చివరి సంవత్సరం గడుస్తుంది. అనుకున్నట్లే డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు మొదలవడానికి 10 రోజులు అని నోటీసు బోర్డులో ప్రకటిస్తారు.ఈ చివరి సంవత్సరంలో అభి మరియు చరిత ఎక్కువసార్లు కలవలేకపోయారు. కారణం కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్స్ అని సెమినార్స్ అని క్యాంపస్ ఇంటర్వూస్ అని తీరిక లేకుండా చేస్తారు కాలేజీ యాజమాన్యం. అయినా కూడా టైం కుదిరినపుడల్లా అభి మరియు చరిత కలిసి మాట్లాడుకునేవారు. ఇలా పరీక్షలకి 10 రోజులే వున్నాయి అని నోటీసు బోర్డు లో చూసి ఈ ప్రేమ జంట ఒక కేఫ్ లో కూర్చొని కాఫీ తాగుతూ ఈ విధంగా చర్చించుకుంటారు.

అభి :- ఈ పరీక్షలు బాగా రాసి ఎలాగైనా క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం తెచ్చుకుంటాను బుజ్జి. మనం పెళ్లి చేసుకుందాం..

చరిత :- సరే రా ని గురించి నాకు తెలియదా.. ముందు పరీక్షలు అయిపోని తర్వాత మాట్లాడుకుందాం..

అని చెప్పుకొని ఇద్దరు వెళ్లి పరీక్షలకి రాత్రి పగలు కష్టపడి చదువుకుంటారు.ప్రేమించిన చరితని పెళ్లిచేసుకోవాలి అని క్యాంపస్ ఇంటర్వ్యూ లో జాబ్ తెచ్చుకోవాలి అని అభి ఇంకా క ష్టపడి చదువుతాడు.

2 నెలల తర్వాత … 

పరీక్షల ఫలితాలు వస్తాయి. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. చరిత డిగ్రీ కాలేజీ లో 1st ర్యాంకర్ గా ఉత్తీర్ణత సాధిస్తుంది. అభి ఏమో 2 సబ్జక్ట్స్ ఫెయిల్ అవుతాడు. ఇంతలో చరిత అభి కి కాల్ చేసి ధైర్యం చెప్తుంది. బాధపడకు అభి మల్లి రాసి పాస్ అవ్వచ్చు. నేను పై చదువులు చదువుకోవడానికి లండన్ వెళ్తున్నాను. బాధపడకు.ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. రాగానే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఫోన్ పెటేస్తుంది. చరిత లండన్ కి వెళ్ళి అభికి కాల్ చేసి చాలా హ్యాపీగా ఉన్నాను అభి. ఇక్కడ నాకు చాల ఫ్రీడమ్ దొరికింది అని సుమారు 7 గంటలు అభితో మాట్లాడుతూనే ఉంటుంది.

ఆలా ఆలా కాలం గడిచిపోగా..

గంటలు నిముషాలు అయ్యాయి. నిముషాలు క్షణాలయ్యాయి. క్షణాలు కనుమరుగయ్యాయి.

పై చదువు చదివే చరిత బిజీ బిజీ లైఫ్ గడుపుతూ అభి తో మాట్లాడటం మరిచిపోయి సంవత్సరం అవుతుంది. అభి కూడా పై చదువులు చదువుతుంది కదా బిజీ ఉం టుందిలే ఇబ్బంది పెట్టకూడదు అని ఫెయిల్ అయిన సబ్జక్ట్స్ మీద ఫోకస్ చేసి పాస్ అవుతాడు. ఆ విషయం చరితకి చెప్పాలని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు చరిత. కొని రోజులు ఆలా గడిచిపోతాయి. క్యాంపస్ ఇంటర్వూస్ అటెండ్ అయ్యే పనిలో పడతాడు అభి.

అనుకోకుండా ఒకరోజు అభి ఫ్రెండ్ హరి కాల్ చేసి మాట్లాడతాడు. ఎలా ఉన్నావ్ మామ. ఏం చేస్తున్నావ్. లైఫ్ ఎలా నడుస్తుంది. నువ్వు చరిత హ్యాపీగానే ఉన్నారు కదా అని అడుగుతాడు. అభి.. అంతా బాగుంది మామ.చరిత పై చదువులతో బిజీ గా వుంది. నేను క్యాంపస్ ఇంటర్వూస్ అటెండ్ అవుతున్నాను. అని చెప్తాడు.

ఒక వారం రోజుల తర్వాత హరి కాల్ చేసి మామ. నువ్వు మోసపోయావ్ మామ. చరిత నిన్ను మోసం చేసింది. లండన్ లో చదువులతో బిజీగా  ఏం లేదు. ఎవరితోనో సినిమాలకు షికార్లకు, చివరికి రూమ్ లో కూడా కలిసి ఉంటుంది అని చెప్తాడు. ఆ మాట విని అభి తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతాడు.అదే సమయంలో చరిత అభి కి కాల్ చేసి బేబీ.. నేను చాల హ్యాపీగా ఉన్నాను రా.మన పెళ్ళికి ఇంట్లో ఒప్పుకున్నారు. చాలా ఆనందంగా ఉంది అని చెప్తుంది. ఇంకో వారంలో నంద్యాల వస్తున్నాను. కలిసి పెళ్లి పనులు మొదలు పెడదాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అభి షాక్ అవుతాడు. హారి ఏమో ఇలా చెప్పాడు. చరిత ఏమో కాల్ చేసి ఇలా చెప్పింది అని షాక్ అయ్యి హరికి కాల్ చేసి మామ నువ్వు చరిత ఎవరితోనో కలిసి ఉంది అని చెప్పావ్ కదా..అతనితో చరిత ఉన్న ఫోటోలు ఉంటే పంపు అని చెప్తాడు. హరి వెంటనే కాఫీ షాప్లో చరిత మరియు ఇంకో మనిషి కలిసి ఉన్న ఫొటోస్ పంపుతాడు అభికి. అభి చాలా బాధపడుతూ కోపంతో  ఉంటాడు. 

ఇంతలో చరిత నంద్యాలకి వచ్చేస్తుంది. అభి ఏదో ఒకటి తేల్చుకుందాం అని కోపంతో కూడిన బాధలో ఉంటాడు. ఇంతలో అభి ఇంటి బెల్ మోగుతుంది. అభి వెళ్లి తలుపు తీస్తాడు. అభి తలుపు తీయగానే చరిత వచ్చి గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆ హాయిలో మునిగి తేలుతున్న అభి చరిత పక్కనే ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి వెంటనే హరి పంపించిన ఫోటోలు మొబైల్ లో చూస్తుంటాడు. ఇంతలో చరిత ఇతను నా ముద్దుల అన్నయ్య. ఇతని వల్లే ఈరోజు మన పెళ్లి జరుగుతుంది. ఇతను లేకుంటే మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒపుకునేవారు కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. ఇతనే మన పెళ్లి పెద్ద అని చెప్తుంది. అభి షాక్ అయ్యి వెంటనే హరి కాంటాక్ట్ ని మొబైల్లో డిలీట్ చేసేస్తాడు. అలా అభి చరిత ఒక్కటవుతారు.

love stories in telugu language

నీతి:- మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు.కోపాలు అనుమానాలు సహజమే కానీ ముందు అసలు విషయం ఏంటో తెలుసుకున్నాక కోపాన్ని ప్రదర్శించడం మంచిది అని నేను మీ అందరికి ఈ ప్రేమజంట ద్వారా తెలియజేస్తున్నాను..

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button