telugu bigg boss

Telugu Bigg Boss Season 5 | Episode 3 Live Updates – Day3

BB5 |  Day3 Live Updates
BB5 | Day3 Live Updates

Bigg boss 5 Episode 3 Day3 Live Updates: 10:00PM:-

ఈరోజు బిగ్ బాస్ యని మాస్టర్ డిస్కషన్ తో మొదలయింది. యని మాస్టర్ తన బాధని చెప్తుంది. జెస్సీ వచ్చి సారీ చెప్పారు. జెస్సీ , యని మాస్టర్ కి సీన్ వివరిస్తూ ఏడ్చేశారు. టాపిక్ ఎండ్ చేశారు. రాత్రి 2 కి కాజల్ వచ్చి అందరిని పడుకో అని హెచ్చరిస్తుంది. మానస్ బిగ్ బాస్ రూల్స్ శ్వేతా వర్మకి చెప్తున్నారు. టాపిక్ హీట్ అవుతుంది. మానస్ మీద నమ్మకం లేక హౌస్ మేట్స్ అందరు పడుకోవడం లేదు మానస్ చేసేది సీక్రెట్ టాస్క్ ఏమో అని.

హౌస్ మేట్స్ కి సిట్యుయేషన్ అర్ధం కావడం లేదు. కాజల్ వచ్చి అందరిని రిక్వెస్ట్ చేస్తుంది పడుకోండి అని.. కానీ ఎవరు పడుకోవడం లేదు. శ్వేతా వర్మ అయితే రాత్రి పడుకునేదే లేదు అని చెప్పేసింది. నటరాజ్ మాస్టర్ కూడా ఎందుకు పడుకోవడం లేదో క్లారిటీ ఇస్తున్నారు. ఉదయం 5 గంటలకి కాజల్ పడుకొని ఉండటం తో సైరన్ మోగింది. ఉదయం 8 గంటలు అయినా ఎవరు పడుకోలేదు. సైరన్ రెండోసారి మోగింది.

ఉదయం 8.30 నిమిషాలకు బిగ్ బాస్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలోని ఇర్రగా ఇర్రగా సినిమా పాట వేసి కంటెస్టెంట్స్ ని నిద్ర లేపారు. కంటెస్టెంట్స్ తమ స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. ఉదయం 11 గంటలకు కాజల్, ప్రియా కిచెన్ మీద డిస్కషన్ చేస్తున్నారు. తర్వాత శ్వేతా వర్మ మరియు హమీద మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. హమీద సర్రిగా మాట్లాడటం లేదు అని మాట్లాడటం రాదు అని శ్వేతా వర్మ కామెంట్ చేస్తుంది. శ్వేతా వర్మ హమీద మీద సీరియస్ అవుతుంది. ఇద్దరు ఏడ్చేశారు. లోబో వచ్చి హామిదని తీసుకొని వెళ్లారు. హమీద బయటికి వచ్చి కామెంట్స్ చేస్తుంది. మధ్యాహ్నం 1 గంటలకు హమీద ఏడ్చేస్తుంది. హౌస్ మేట్స్ అందరు తన చుట్టూ చేరారు. నటరాజ్ మాస్టర్ హమీద కోసం ఫుడ్ చేపిస్త అన్నారు. నటరాజ్ మాస్టర్ వచ్చి ప్రియా కి మేటర్ చెప్తున్నారు.

తర్వాత రవి మరియు షాను వచ్చి హమీద మరియు శ్వేతా వర్మ మధ్య మనస్పర్థలు తొలిగించారు. ఇద్దరు హాగ్ చేసుకొని కెమెరాకు స్మైల్ ఇచ్చారు బ్రేక్.

overall :- ఇప్పటివరకు సరదాగా మరియు ఎమోషనల్ గా సాగింది. కంటెస్టెంట్స్ చిన్న చిన్న విషయాలకు సీరియస్ అయ్యి గొడవ పడుతున్నారు.

10:42PM :-

బ్రేక్ తర్వాత హమీద మరియు శ్రీరామ్ మధ్య లవ్ ట్రాక్ మొదలయింది. ఇద్దరు బర్త్ డే మరియు రాశి లా గురించి మాట్లాడుకుంటున్నారు. శ్రీరామ్ కామెడీ చేసి హమీద ని నవ్విస్తున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు బిగ్ బాస్ సైరన్ మోగించారు. ఈసారి సిరి పవర్ రూమ్ లో ఎంట్రీ దక్కించుకుంది. బిగ్ బాస్ సిరి కి ఇద్దరు ఇంటి సభ్యులను ఎంచుకొని , ఒకరు ఇంకొకరికి సర్వెంట్ లాగా ఉండాలని ఆదేశమిచ్చారు. సిరి షణ్ముఖ్ యజమానిగా మరియు లోబో సర్వెంట్ గా అని చెప్పింది. బయటికి వచ్చి కంటెస్టెంట్స్ కి మేటర్ చెపింది. లోబో కామెడీ స్టార్ట్ చేశారు. తర్వాత కాజల్ వచ్చి శ్రీరామ్ కి అమ్మాయిలు ఎలా ఉంటె బాగుంటుంది అని ప్రశ్నలు అడిగింది.

షణ్ముఖ్ లోబో కి టాస్క్ ఇచ్చారు. అందరి కంటెస్టెంట్స్ ల ఇమిటేట్ చేసి చూపించు అని. లోబో ఇమిటేట్ చేసి కామెడీ చేస్తున్నారు. రవి , సిరి , లోబో కామెడీ ఎపిసోడ్ కె హై లైట్ ఎలా ఉంది.

సాయంత్రం 5 గంటలకు నటరాజ్ మాస్టర్ , రవి , విశ్వా డిస్కస్ చేస్తున్నారు. తర్వాత 6 గంటలకు హమీద మరియు శ్వేతా వర్మ డిస్కస్ చేసుకొని ఇద్దరి మధ్య బాధలను డిస్కస్ చేసుకొని హాగ్ ఇచ్చుకున్నారు. రాత్రి 7 గంటలకు లోబో మల్లి కామెడీ చేస్తున్నారు. ఈసారి పాట పడుతూ హౌస్ అంత ఎనర్జీ లెవెల్స్ పెంచారు. సిరి పవర్ రూమ్ లో మల్లి వెళ్ళింది. సిరి ఎంచుకున్న ఇద్దరు సభ్యులు సరిగా టాస్క్ చేయకపోవడం తో సిరి కి మొదటి హెచ్చరిక ఇచ్చారు.

టాస్క్ సీరియస్ గా చేయండి అని సిరి చెపింది. రాత్రి 9 గంటలకు షణ్ముఖ్ లోబో తో వాష్రూమ్ లో క్లీన్ చేపిస్తునారు. రవి వచ్చి లోబో మీద కామెడీ చేస్తున్నారు. తర్వాత ప్రియా బాధపడుతుంది మిగితా హౌస్ మేట్స్ వచ్చి ఓదారుస్తున్నారు. ప్రియకి తన ఫామిలీ మెంబెర్స్ గుర్తుకొచ్చారు బ్రేక్.

Overall :- మొత్తానికి ఈ ఎపిసోడ్ కి హై లైట్ గా లోబో కామెడీ ఉండబోతుందని. లోబో కామెడీ వల్ల ప్రెక్షకులకు కాస్త ఆనందాని ఇస్తుంది .

10:49PM :- బ్రేక్ తర్వాత మానస్ మరియు కాజల్ ఒక్క టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నారు . రవి గురించి మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఉమాదేవి వచ్చి పాలకూర టాపిక్ లేపారు. యని మాస్టర్ ఫ్రిడ్జ్ లో ఎందుకు పెడుతుంది అని గొడవ మొదలుపెట్టింది. కూర ఎందుకు ఫ్రిడ్జ్ లో దాచిపెట్టారు అని ఉమాదేవి సీరియస్ అవుతున్నారు బ్రేక్.

overall :- ఫుడ్ మీద అసలైన గొడవ మొదలవుతుంది.

11:00PM :- బ్రేక్ తర్వాత ఉమాదేవి యని మాస్టర్ మధ్య ఫుడ్ గొడవ మొదలయింది. యని మాస్టర్ క్లారిటీ ఇయడానికి ట్రై చేస్తున్నారు. యని మాస్టర్ ఫ్రిడ్జ్ లో ఫుడ్ దాచిపెట్టడం వాళ్ళ గొడవ మొదలయింది. ఉమాదేవి తినేటపుడు కూర లేదని చేపి ఫ్రిడ్జ్ లో కూర ఉన్నందుకు ఉమాదేవి సీరియస్ అయింది. యని మాస్టర్ సారీ చెప్పారు. ఈ సీన్ తో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

overall :- మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ బాగా పండింది. లోబో నే సెంటర్ అఫ్ అట్రాక్షన్.

Till by Know Day2

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button