Telugu Bigg Boss Season 5 | Episode 4 Live Updates – Day 4
Bigg boss 5 Episode 4 Day 4 Live Updates: 10:00PM:-

Bigg boss 5 Episode 4 Day4 Live Updates: 10:00PM:-
ఈరోజు బిగ్ బాస్ లో లహరి లేచి వాష్ రూమ్ వెళ్ళడం కాజల్ పడుకోవడంతో బిగ్ బాస్ సైరన్ మోగించారు. అందరు లేచారు తర్వాత ఉదయం 7 గంటలకు శ్రీరామ్ లేచారు కాజల్ ని లేపనందుకు సైరన్ మోగింది. ఉదయం 8 గంటలకు శ్రీమంతుడు లోని నెల నెల సాంగ్ తో హౌస్ మేట్స్ ని నిద్ర లేపారు. హౌస్ మేట్స్ తమ స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. ఉదయం 10 గంటలకు లోబో సర్వెంట్ గా , షాను యజమాని గా చేస్తున్నారు. లోబో లోలోపల షాను ని తిట్టుకుంటున్నాడు. లోబో సరయు సీన్ చెప్తూ బాధ పడుతున్నాడు. ఉదయం 10:40 కు లోబో సిగేరేట్ రూమ్ లో బాధ పడుతున్నాడు. తర్వాత షాను రవి డిస్కస్ చేస్తున్నారు లోబో ఎలా ఉంటాడు అని.
తర్వాత 11:15 కు బిగ్ బాస్ సైరన్ మోగింది. ఈసారి పవర్ రూమ్ ఎంట్రీ హమీద దక్కించుకుంది. బిగ్ బాస్ హమీద కు టాస్క్ ఇచ్చారు. హమీద ఎంచుకున్న ఇంటి సభ్యులు ఈపాటికి కెప్టెన్ కాలేరు. హమీద ప్రియా పేరు చెపింది. హమీద బయటికి వెళ్లి కంటెస్టెంట్స్ ని తన డెసిషన్ చెపింది. ప్రియా బాధతోనే ఒప్పుకుంది. తర్వాత మిగితా హౌస్ మేట్స్ ప్రియని మెచ్చుకుంటున్నారు. సన్నీ ప్రియని ఓదారుస్తున్నారు.
మధ్యాహ్నం 1:30 నిమిషాలకు యని మాస్టర్ మరియు మానస్ మధ్య చర్చ జరుగుతుంది. తర్వాత సిగేరేట్ రూమ్ లో లోబో విశ్వా కి చేపి బాధ పడుతున్నాడు. విశ్వా లోబో ని ఓదారుస్తున్నారు. తర్వాత లోబో ప్రియాంక ని లైన్ లో పెట్టాలని ట్రై చేస్తున్నాడు. ప్రియా వైపే చూస్తున్నాడు. ప్రియా మానస్ ముందర ఈ మాట చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోయింది. లోబో రవి ప్రియాంక కామెడీ చేస్తున్నారు. తర్వాత వాష్ రూమ్ లోనే లోబో మానస్ కి జరిగింది చెప్తున్నారు. తర్వాత ప్రియాంక లోబో కి మేక్ అప్ వేస్తుంది. లోబో వాక్ చేస్తున్నారు కొత్త గెట్ అప్ లో. సాయంత్రం 4:30 నిమిషాలకు లోబో కామెడీ చేస్తున్నారు. శక్తి ని చూపరు డింభకా టాస్క్ ఫినిష్ అయింది. బిగ్ బాస్ హమీద , మానస్ , విశ్వా మరియు సిరి కి మొదటి క్యాప్టియన్ టాస్క్ కి సిద్ధం అవుతున్నారు బ్రేక్.
overall : ఇప్పటివరకు కామెడీ బాగుంది. లోబో బెస్ట్ ఇస్తున్నారు.
10:44PM :-
బ్రేక్ తర్వాత హౌస్ మేట్స్ కెప్టెన్సీ టాస్క్ కి సిద్ధం అవుతున్నారు. సరయు బాధ పడుతుంది. తన బాధను యని మాస్టర్ తో పంచుకొని బాధ పడుతున్నారు. యని మాస్టర్ సరయుని ఓదారుస్తున్నారు. తర్వాత ప్రియాంక కెప్టెన్సీ టాస్క్ వివరిస్తుంది. టాస్క్ పేరు తొక్కారు తొక్కు హైలెస్స. సైకిల్ తొక్కుతూనే ఉండాలి. సైకిల్ బల్బ్ వెలుగుతూనే ఉండాలి. హౌస్ మేట్స్ ప్రియా ని సంచాలకుడిగా నిర్ణయించారు. రవి మరియు మిగితా సభ్యులు ఎలా ఆలా చెప్తారు అని ఇష్యూ రైజ్ చేస్తున్నారు. హౌస్ లో రచ్చ చేస్తున్నారు ప్రియా ని సంచాలకుడుగా ఎంచుకునేందుకు. హౌస్ మేట్స్ అందరు కూర్చొని సంచాలకుడుని నిర్ణయిస్తున్నారు. ఓట్స్ ప్రకారం కూడా ప్రియా కె వచింది. టాస్క్ మొదలయింది.
అందరు కెప్టెన్సీ పోటీదారులు సైకిల్ తొక్కుతున్నారు. లోబో కామెడీ జెనెరేట్ చేస్తున్నారు. సైరన్ మెగింది. లహరి స్టార్ తీసుకున్నందున్న లహరి వాటర్ తీసుకొని మానస్ కి ఇచ్చింది. మానస్ సైకిల్ తొక్కుతూ వాటర్ తాగుతున్నారు. కాజల్ విశ్వా ని డిస్టర్బ్ చేస్తుంది. కాజల్ విశ్వా ని టార్గెట్ చేసింది. విశ్వా ని శ్రీరామ్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ తమ ప్లన్స్ అమలు చేస్తున్నారు. విశ్వా అవుట్ అయ్యారు. లోబో ఆయిల్ పోస్తున్నారు మిగితా కంటెస్టెంట్ సైకిల్ లో . ఇపుడు సన్నీ కి రవి కి గొడవ పడింది. సిరి సైకిల్ ఒకటే లైట్ తో ఉండటం తో సిరి గెలిచింది.
కాజల్ సరయు మధ్య హీట్ డిస్కషన్ మొదలయింది. కాజల్ డబల్ గేమ్ ఆడిందని సరయు ప్రూవ్ చేసింది బ్రేక్ .
overall :- ఆట రసవత్రంగా జరిగింది కాజల్ డబల్ మైండెడ్ అని సరయు దెబ్బకి ప్రూవ్ చేసేసింది.
10:51PM :- బ్రేక్ తర్వాత విశ్వా ఓపెన్ గా కాజల్ మైండ్ సెట్ చెప్పారు. ఎలా కాజల్ విశ్వా ని టార్గెట్ చేసింది అని చెప్తున్నారు. రాత్రి 10 గంటలకీ ప్రియా విజేతగా సిరి ని ప్రకటించింది. సీజన్ 5 మొదటి కెప్టెన్ సిరి అయింది. సరయు ని ప్రియా సంజాయిషి చెప్తున్నారు. బిగ్ బాస్ సిరిని కెప్టెన్ గా ప్రకటించారు. ప్రియా కెప్టెన్సీ బ్యాండ్ తీసుకొని వచ్చి సిరి కి వేసింది బ్రేక్ .
overall :- షో లో అసలైన హీట్ ఇపుడు మొదలయింది.
11: 00PM :- బ్రేక్ తర్వాత సిరి హౌస్ మేట్స్ ని డివైడ్ చేసింది. రేషన్ మ్యానేజర్ గా విశ్వా ని ఎంచుకుంది. ఉమా దేవి మరియు ప్రియాంక మధ్య నాన్ వెజ్ క్లీనింగ్ మధ్య గొడవ మొదలయింది. మధ్యలో లహరి వచ్చి ఉమా దేవి తో గొడవ మొదలయింది. లహరి ఉమాదేవి మధ్య గొడవతోనే ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.
Overall :- మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ చాల గొడవలతో , కొంచెం కామెడీ తో ప్రేక్షకులని అలరించింది.