telugu bigg boss

Telugu Bigg Boss 5 3rd Weekend Sunday Live Updates

bigg-boss-live-Updates
Telugu Bigg Boss 5

Telugu Bigg Boss 5 3rd Weekend Sunday Updates:

ఈరోజు ఎలిమినేషన్ డే హౌస్ లోని నామినేషన్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ నాగార్జున గారి దగ్గరికి వచ్చి హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు. వారు ఎవరో ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. లైవ్ అప్ డేట్స్ ఇయడానికి మేము రెడీ , చదవడానికి మీరు రెడీ నా ? అయితే పేజీ ని రిఫ్రెష్ చేస్తూ లైవ్ అప్ డేట్స్ ని ఎంజాయ్ చేయండి.

9:25PM :- ఈరోజు బిగ్ బాస్ లో నాగార్జున గారు లెహరాయి లెహరాయి అనే పాటతో లవ్లీ స్టెప్స్ వేస్తూ స్టేజి పైకి వచ్చారు. ఈరోజు సండే , సండే అంటే ఫన్ డే . కాబట్టి ఈరోజు హౌస్ లో హుంగామ మాములుగా ఉండదు అని నాగార్జున గారు ఆలస్యం చేయకుండా మన టీవీ అని చెప్పగా హౌస్ లో కంటెస్టెంట్స్ రెడీ అయి కూర్చున్నారు.

ఇపుడు గేమ్ ఆడబోతున్నాం అని నాగ్ గేమ్ పేరు స్ఫోటిఫ్య సాంగ్ అని చెప్పారు. కంటెస్టెంట్ ఫుల్ ఆనందం లో ఉన్నారు. నాగ్ అందరిని గార్డెన్ ఏరియా లో రమన్నారు. కంటెస్టెంట్స్ ని టీం ఎ మరియు టీం బి గా డివైడ్ చేసారు. ఇపుడు కాజల్ టాస్క్ గురించి వివరిస్తుంది. ఈ టాస్క్ లో డివైడ్ అయినా టీం లో నాగ్ పాట ప్లే చేయగా రెండు టీం లోని సభ్యులు బజ్జర్ నొక్కాలి , బజ్జర్ నొక్కినా టీం మిగిలిన లైన్స్ పాడాలి. వారికీ ఒక మార్క్ వస్తది.

ఇపుడు నాగ్ సిరి మరియు లహరి వచ్చి బజ్జర్ ముందు వచ్చి ట్యూన్ వినగా ఆ ట్యూన్ అలవైకుంఠపురం లోని బుట్ట బొమ్మ సాంగ్. కరెక్ట్ గా సిరి చెప్పింది కాబట్టి ఇపుడు సిరి శ్రీరామ్ ని సెలెక్ట్ చేసుకొని ఈ పాటకి డాన్స్ వేసింది. టీం ఎ కి వన్ పాయింట్

తర్వాత హమీద మరియు జెస్సీ నిలవగా ట్యూన్ వినగానే జెస్సీ బజ్జర్ నొక్కారు. ఆ పాట జాతిరత్నాలు లోని చిట్టి సాంగ్. ఇపుడు జెస్సీ మరియు హమీద కలిసి ఈ పాట కి డాన్స్ వేస్తున్నారు. మరోసారి టీం ఎ కి వన్ పాయింట్.

తర్వాత బజ్జర్ ముందర విశ్వా మరియు శ్వేతా నిలబడగా ముందుగా విశ్వా బజ్జర్ నొక్కారు. పాట కూడా నేను శైలజ లోని క్రేజీ ఫీలింగ్ సాంగ్. ఈ పాటకి ఇప్పుడు విశ్వా మరియు యని మాస్టర్ కలిసి డాన్స్ వేస్తున్నారు. ఇపుడు టీం బి కి వన్ పాయింట్. తర్వాత ప్రియాంక మరియు సన్నీ నిలబడగా సన్నీ ట్యూన్ వినకుండానే బజ్జర్ నొక్కారు. ఇపుడు సన్నీ తప్పు వలన టీం బి లో మైనస్ పాయింట్. ఇపుడు ప్రియాంక ఆ పాటని గెస్ చేసి తనతో పాటు డాన్స్ వేయడానికి మానస్ ని పిలిచింది ఆ పాట ఇష్మార్ట్ శంకర్ లోని సిలికా సిలికా పాట. ఇపుడు టీం ఎ కి 2 పాయింట్స్.

ఇపుడు కాజల్ మరియు మానస్ వచ్చారు. బజ్జర్ కాజల్ నొక్కింది. కాజల్ పార్టనర్ గా షణ్ముఖ్ ని సెలెక్ట్ చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఉప్పెన లోని ని కన్ను నీలి సముద్రం పాటకి డాన్స్ వేశారు. ఇపుడు టీం బి కి వన్ పాయింట్. తర్వాత షణ్ముఖ్ మరియు రవి బజ్జర్ ముందర నిలవగా షణ్ముఖ్ బజార్ ముందుగా నొక్కారు. షణ్ముఖ్ నటరాజ్ మాస్టర్ ని పార్టనర్ గా సెలెక్ట్ చేసుకొని ఓహ్ మై గాడ్ డాడీ అనే పాటకి డాన్స్ వేశారు. ఇపుడు టీం ఎ కి 3 పాయింట్స్.

ఇపుడు నటరాజ్ మాస్టర్ మరియు ప్రియా నిలవగా ముందుగా నటరాజ్ మాస్టర్ బజ్జర్ నొక్కారు. ఇపుడు నటరాజ్ మాస్టర్ మరియు యని మాస్టర్ కలిసి ప్రియరాగాలే సాంగ్ కి డాన్స్ వేశారు. ఇపుడు టీం ఎ కి 4 పాయింట్స్ . తర్వాత యని మాస్టర్ మరియు లోబో నిలవగా యని మాస్టర్ బజ్జర్ నొక్కారు. యని మాస్టర్ తన పార్టనర్ గా లోబో నే సెలెక్ట్ చేసుకొని ఇద్దరు పక్క లోకల్ పాటకి డాన్స్ వేశారు. ఇపుడు టీం బి కి 2 పాయింట్స్.

ఇపుడు స్ఫోటిఫ్య్ గేమ్ లో టీం ఎ విన్నర్ అయ్యారు. ఇపుడు శ్రీరామ్ ఒకడు మిగిలారు కాబట్టి సిరి మరియు శ్రీరామ్ కలిసి సారంగదనియా పాటకి డాన్స్ వేశారు.

ఇపుడు టైం లో సేవ్ వన్ కంటెస్టెంట్. నామినేషన్స్ లో ఉన్న 3 కంటెస్టెంట్స్ ని మధ్యలో నిలబడండి అని చెప్పారు. ఇపుడు కెప్టెన్ జెస్సీ కార్ స్టీరింగ్ లహరి కి ఇచ్చారు లహరి తిప్పగ కార్ బద్దలైన సౌండ్ రావడం తో లహరి సేఫ్ కాలేదు. ఇపుడు మానస్ స్టీరింగ్ తిప్పారు. మానస్ సేఫ్ అని కార్ సౌండ్ చేసింది. ప్రియా కూడా కార్ స్టీరింగ్ తిప్పింది కానీ సేఫ్ కాలేదు. ఇపుడు ప్రియా మరియు లహరి నామినేషన్ లో ఉన్నారు నాగార్జున గారు బ్రేక్ అన్నారు.

9:45PM :- బ్రేక్ తర్వాత నాగార్జున గారు ఆలస్యం చేయకుండా మన టీవీ అని చెప్పారు. హౌస్ లో కంటెస్టెంట్స్ అందరు లివింగ్ రూమ్ లో కూర్చున్నారు. ఇపుడు నాగ్ కంటెస్టెంట్స్ తో ఒక చిన్న గేమ్ ఆడుదాం అన్నారు. ఆ గేమ్ పేరు టచ్ చేసి చెప్పు . మొదటి ఆటలో ఉన్న టీమ్స్ ఏ కానీ జెస్సీ ని సంచలకులాడు గా పెట్టారు.

ఇపుడు ముందుగా షణ్ముఖ్ మరియు సిరి కి బ్లైండ్ ఫోల్డ్ చేసారు. వీరు కలిసి ఆబ్జెక్ట్ ని టచ్ చేసి చెప్పగా ఇంకొకరు గెస్ చేయాలి. ఆబ్జెక్ట్ టచ్ చేయడానికి సిరి ముందుకు వచ్చి ఆబ్జెక్ట్ ని ముట్టుకొని షణ్ముఖ్ కి వివరిస్తుంది. ఆబ్జెక్ట్ పేరు ఆవాలు. షణ్ముఖ్ గెస్ చేయలేకపోయారు. షణ్ముఖ్ చూసి కూడా గెస్ చేయలేకపోయారు.

ఇప్పుడు లహరి గెస్ చేస్తా అని చెప్పగా ప్రియా వచ్చి ఆబ్జెక్ట్ ని టచ్ చేసి చెప్తుంది. ప్రియా చెప్పిన వెంటనే లహరి గెస్ చేసింది. ఐటెం పేరు పల్లీలు. ఇపుడు టీం బి కి వన్ పాయింట్. ఇపుడు టీం ఎ నుంచి ప్రియాంక మరియు శ్వేతా వచ్చారు. ఇద్దరు బ్లైండ్ ఫోల్డ్ అయ్యారు. ప్రియాంక ఆబ్జెక్ట్ ని టచ్ చేసి వివరించగా శ్వేతా కరెక్ట్ గా చెప్పింది . ఐటెం పేరు సగ్గుబియ్యం.

ఇపుడు యని మాస్టర్ మరియు విశ్వా వచ్చారు. యని మాస్టర్ ఆబ్జెక్ట్ ని టచ్ చేసి వాసనా విని విశ్వా కి వివరిస్తుంది. యని మాస్టర్ ఏ గెస్ చేయలేకపోయింది. ఆబ్జెక్ట్ పేరు పెన్ ఇన్క్.

ఇపుడు టీం ఎ నుంచి నటరాజ్ మాస్టర్ మరియు మానస్ వచ్చారు. నటరాజ్ మాస్టర్ ఆబ్జెక్ట్ టచ్ చేసి వివరిస్తున్నారు. మానస్ చెప్పలేకపోయారు. ఐటెం పేరు గోరు చిక్కుడుకాయ. ఇపుడు సన్నీ ఐటెం హమీద కి వివరిస్తున్నారు. ఐటెం పేరు సీతాఫలం. హమీద గెస్ చేయలేకపోయింది. తర్వాత శ్రీరామ్ ఐటెం గురించి లోబో కి వివరిస్తున్నారు. శ్రీరామ్ గెస్ చేయలేకపోయారు.

ఇపుడు రవి మరియు కాజల్ వచ్చారు. కాజల్ ఐటెం ని రవి కి వివరించారు. రవి గెస్ చేసారు ఐటెం పేరు లవంగ చెక్క. మొత్తానికి ఈ టాస్క్ లో టీం బి గెలిచింది. ఇపుడు నామినేషన్స్ లో ఉన్న ఇద్దరినీ నిల్చోబెట్టి నాగ్ బ్రేక్ అన్నారు.

10:00 PM :- బ్రేక్ తర్వాత నామినేషన్ లో ఉన్న ప్రియా మరియు లహరి నిలబడి ఉండగా నాగ్ చేతిలో రెండు టార్చ్ లైట్స్ ఉన్నాయి. రెండు లైట్స్ రెడ్ కలర్ లో ఉన్నాయి. ఒక చేతిలో లహరి టార్చ్ గా మరియు ఇంకో చేతిలో ప్రియా టార్చ్ ఉంది. ఎవరి రెడ్ టార్చ్ గ్రీన్ గా మారుతుందో వారు ఎలిమినేట్ కాలేదు అని అర్ధం. నాగార్జున గారు బిగ్ బాస్ ని లైట్స్ ఆఫ్ అనగా స్టేజి పైన లైట్స్ అన్ని ఆఫ్ అయ్యాయి. ఇపుడు ప్రియా మరియు లహరి రెడ్ టార్చ్ లైట్స్ ఒకటి షేక్ అవుతున్నాయి. ప్రియా మరియు లహరి టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ప్రియా టార్చ్ గ్రీన్ లో మారగ ప్రియా సేఫ్ అయింది. లహరి టార్చ్ రెడ్ గానే ఉండటం తో లహరి ఎలిమినేటెడ్. మొత్తానికి ఈవారం ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్ లహరి.

లహరి చాల బాధ పడుతుంది. కంటెస్టెంట్స్ ఓదారుస్తున్నారు. లహరి ఏడ్చేస్తుంది. లహరి సిరి కి ఇన్ డైరెక్ట్ గా తిట్టి వెళ్ళిపోయింది. సిరి లహరి మీద కోపం ఉందని రవి కి చెప్పి బాధపడుతుంది బ్రేక్.

10:15PM :- బ్రేక్ తర్వాత లహరి హౌస్ లో నుంచి బయటికి అంటే నాగార్జున గారి దగ్గరికి వచేసింది. ఇపుడు నాగార్జున లహరి జర్నీ వీడియో చూపిస్తున్నారు. జర్నీ వీడియో చాల ఎమోషనల్ గా ఉండటం తో లహరి ఏడ్చేసింది. ఇపుడు నాగార్జున గారు మన టీవీ అని చెప్పగా హౌస్ లో కంటెస్టెంట్స్ బయట నాగ్ గారి పక్కన ఉన్న లహరిని చూసి బాధ పడుతున్నారు.

ఇపుడు లహరి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతుంది. నాగ్ సెనోరిటా ని పిలవగా సెనోరిటా బోర్డు తీసుకొని వచ్చింది. బోర్డు మీద ఫెయిల్డ్ హౌస్ మేట్స్ అని టైటిల్ ఉంది. లహరి శ్రీరామ్ కి పాట పాడమని కోరగా శ్రీరామ్ ఎటో వెళ్ళిపోయింది మనసు పాట పడ్డారు.

తర్వాత నాగ్ సెనోరిటా తెచ్చిన బోర్డు గురించి చెప్పారు. లహరి మొదటిగా సిరి ఫోటో పెట్టింది ఆ బోర్డు మీద. తర్వాత యని మాస్టర్ ఫోటో పెట్టి ఇద్దరి మీద కొంచెం నెగటివ్ గానే చెప్పింది. తర్వాత రవి ఫోటో పెట్టి బీ కేర్ ఫుల్ అని చెప్పింది. తర్వాత ప్రియా ఫోటో పెట్టి ఫ్యూచర్ లో జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పింది. తర్వాత శ్రీరామ్ ఫోటో పెట్టి ని గురించి కూడా కొంచెం ఆలోచించు అని చెపింది.

తర్వాత విశ్వా కి స్ట్రాంగ్ గా ఉండు అని చెప్పింది. తర్వాత లోబో కి జాగ్రత్తగా ఆడు అనింది. తర్వాత నటరాజ్ మాస్టర్ భోళా శంకరుడు అని చెప్పి అందరిని నవ్విస్తుంది. తర్వాత శ్వేతా ఫోటో పెట్టి బి స్ట్రాంగ్ అని చెప్పింది. తర్వాత కాజల్ ఫోటో పెట్టి కెమెరాలు ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పింది.

తర్వాత షణ్ముఖ్ ఫోటో పెట్టి సిరి వేసింది అని నన్ను నామినేట్ చేసావ్ అని చెప్పింది. షణ్ముఖ్ సీరియస్ అయ్యాడు బ్రేక్.

10:30PM :- బ్రేక్ తర్వాత లహరి మరియు షణ్ముఖ్ సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. అందరు షణ్ముఖ్ సిరి ఒకరే అని ఎలా చెప్తావ్ అని షాను , లహరి కి సీన్ వివరిస్తున్నారు. లహరి మాత్రం షణ్ముఖ్ కి సిరి ఎం చెప్తే అది నమ్మకు చాల సార్లు ఆలోచించు అని చెపింది.

ఇపుడు బోర్డు మీద జెస్సీ ఫోటో పెట్టి తమ్ముడు అని చెప్పి కామెడీ చేసింది. తర్వాత సన్నీ ఫోటో పెట్టి చాల సెన్సిటివ్ అని చెప్పింది. ఇపుడు మానస్ ఫోటో పెట్టి తెలుసుకోవలసింది చాల ఉంది అని చెప్పింది. ప్రియాంక ఫోటో పెట్టి చాల స్వీట్ అని చెప్పింది. చివరిగా హమీద ఫోటో పెట్టి ని ఆట నువ్వు ఆడు అని చెప్పింది.

ఇపుడు కంటెస్టెంట్స్ అందరు గుడ్ బాయ్ చెప్పారు. లహరి వెళ్ళిపోయింది. నాగార్జున అందరికి గుడ్ నైట్ చెప్పారు. వచ్చే శనివారం మల్లి వచ్చి కలుస్తాను అని చెప్పేసి వెళ్లిపోయారు. ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button