తెలుగు బాషా పుట్టుక ఎక్కడో తెలుసా?

telugu baasha history:: తెలుగు భాష లిపి చరిత్ర సంస్కృతంలోనే తియ్యదనమూ, తమిళంలోని అమృతత్వమూ కన్నడంలోని సుమధుర పరిమళమూ కలగలిసిన కమ్మనైన భాష తెలుగు. భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి, భారత ప్రభుత్వం తెలుగుతో పాటు తమిళ భాషలకు 2008లో ప్రాచీన భాష హోదా తో గౌరవించింది.
తెలుగువాళ్లు ఎక్కువగా యానాం తమిళనాడు కర్నాటక మహారాష్ట్ర ఒడిసా చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ కనిపిస్తారు , తెలుగు మాతృభాష గా కలిగినవారు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లిన కనబడతారు అనడం లో అతిశయోక్తి లేదు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎనిమిదిన్నర కోట్ల జనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో మూడవ స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా 15 స్థానాల్లో గెలిచింది .
ద్రావిడ భాషల్లో 84బాషలున్న(తెలుగు, తమిళం,మలయాళం…) అందులో ఎక్కువగా
మాట్లాడుతున్న ద్రావిడ భాష తెలుగు భాష. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందనీ తెలుగుకు మాతృక సంస్కృతం అని జనబాహుళ్యంలో బలమైన అపోహ ఉన్నది.

కానీ ఉనికిలో ఉన్న అన్ని ద్రవిడ భాషలు ఒకే మూలద్రావిడ మాతృక నుంచి క్రమంగా విడివడి వేరువేరుగా ఏర్పడ్డాయని పరిశోధకులు అంచనా.
Telugu baasha history
అసలు తెలుగు భాష పదం ఎలా ఏర్పడిందనే విషయాన్ని కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం , పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్నే త్రిలింగ ప్రాంతం నుండే తెలింగా, తెలుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని ఒక వాదన ఉన్నది.
అందుకే తమిళులు ఇప్పటికీ తెలుగు వాళ్ళని తెళుంగు అని పిలుస్తారు.
కాబట్టి తెలుగువారు కృష్ణా గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతంలో నివసించేవారని చెప్పవచ్చు . తెలుగు భాషకి కనీసం 2400 ఏళ్ల చరిత్ర ఉంది, మూల ద్రవడ భాష నుండి ఏర్పడి ప్రతేక భాషగా ఏర్పడింది.
More interestings here
ఇది మన తెలుగు భాష చరిత్ర , నచ్చితే షేర్ చెయ్యండి…