రికార్డ్ సృష్టించిన తెలంగాణ, Telangana state GST record
జిఎస్టి వసూళ్లు అక్టోబర్ మాసంలో Telangana state GST record రూ .1 లక్ష కోట్లు దాటటం , దేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసులు గణనీయంగా తగ్గుతూ ఉండటం శుభసూచనలనవచ్చు . అయితే ఈ రెండు విషయాల్లో నిలకడను ఊహిం చటం తొందరపాటు అవుతుంది . మొదటిది మార్కెట్ స్థిరత్వంతో ముడి పడి ఉంది . రెండవది , భరోసాతో ఉండకూడనిదని అమెరికా , యు.కె. , ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెచ్చరిల్లటం హెచ్చ రిక చేస్తున్నది .
అక్టోబర్ లో పండుగల సీజన్ ఆరంభమైంది . గత 10 మాసాలుగా తమ అవసరాలను వాయిదా వేసుకున్న ప్రజలు కొనుగోళ్లు ముమ్మరం చేశారు . పర్యవసానంగా జీఎస్టీ వసూలు రూ .1,05,155 కోట్లకు చేరి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నదన్న భ్రమ కలిగిస్తున్నది . మార్చి నెల ఆఖరులో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు . అప్పటికి ఆ నెల దాదాపు ముగింపులో ఉన్నందున జిఎస్టి వృద్ధి 15.6 శాతం నమోదైంది . ఆ తర్వాత ఏప్రిల్ లో వసూలు ఒకసారి రూ .32,172 కోట్లకు ఢమాల్ అయింది . తర్వాత మాసాల్లో అది రూ .62,151 కోట్ల నుంచి రూ .95,480 ( సెప్టెంబర్ ) కోట్ల మధ్య ఊగిసలాడింది . కాగా అక్టోబర్ లో 10.2 శాతం పెరుగుదలతో కోవిడ్ పూర్వపు స్థాయి దరిదాపుకు చేరింది .
ఈ నెలలో దీపావళి పండుగ దృష్ట్యా మార్కెట్ ఊపు కొనసాగుతుంది . భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలివ్వటమేగాక వృద్ధి బాటలో ప్రవేశించిం దని పన్ను వసూళ్లు , ఇతర కొలబద్దలు సూచిస్తున్నాయని ఆర్థికశాఖ కార్య దర్శి అజయ్ భూషణ్ పాండే సంతోషం వ్యక్తం చేశారు . అయితే పండుగల సీజన్ తదుపరి వినియోగదారుల ఉత్సాహం సన్నగిల్లుతుందని మార్కెట్ నిపుణులు , ఆర్థిక వేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . అంతేగాక మార్కెట్ జోరు కొన్ని రంగాలకే పరిమితమైంది . ఏమైనా మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను వేగవంతం చేయటం , పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకున్న అడ్డంకులను సత్వరం తొలగించటంపై ప్రత్యేక దృష్టి పెట్టటం అవసరం . కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి వచ్చి , దాన్ని ప్రజ లందరికీ అందించి వ్యాధిని నిర్మూలించటం పైనే ప్రజల ఆత్మవిశ్వాసం ఆధారపడి ఉంటుంది .
Telangana state GST record ::

ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు మైనస్ 10 శాతంగా ఉంటుందన్న అంచనాలు మన ఆర్థిక వ్యవస్థ దుస్థితిని తెలి యజేస్తున్నది . అందువల్ల ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టితో ప్రభుత్వ విధా నాలు రూపొందించటం అవసరం . రెండు , కోవిడ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గుదల చూపుతూ ఉండటం సంతోషదాయకం . సెప్టెంబర్ 11 న 97,650 కేసుల అత్యధిక స్థాయిని చేరి , ఒక్కరోజు కొత్త కేసుల్లో అన్ని దేశాలను మించిపోవటం అత్యంత ఆందోళనకర స్థితిని సృష్టించింది . ఆ తర్వాత అమెరికాలో అత్యధికంగా అక్టోబర్ 30 న 99,780 కేసులు నమోదు అయినాయి . మన దేశంలో సెప్టెంబర్ మధ్య నుండి క్రమంగా తగ్గుముఖంలో ఉన్న కొత్త కేసులు అక్టోబర్ 25 నుంచి రోజూ 50 వేల దిగువకు చేరాయి . టెస్టింగ్ తగ్గించకపోయినా కేసులు తగ్గటం , అదీ కోవిడ్ -19 దెబ్బకు తీవ్రంగా గురైన రాష్ట్రాల్లో గణనీయమైన తగ్గుదల ఉండటం ఉపశమన దాయమైన విషయం . అయితే కేసుల తగ్గుదల గణాంకాలు ఉదాసీనతకు దారితీయకూడదు .
శీతాకాలం దృష్ట్యా , పండుగల సీజన్లో ప్రజలు ఎక్కు వగా కలవటం వల్ల , విద్యాసంస్థలు క్రమంగా తెరుస్తున్నందున కరోనా తిరిగి బలపడే , తీవ్రస్థాయికి చేరే అవకాశం నిరాకరించలేనిది . బ్రిటన్ , ఇటలీ , ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఆంక్షలన్నీ ఎత్తివేసిన పర్యవసానంగా ప్రజల సంచారం పెరిగి కోవిడ్ -19 తిరగబెట్టింది . రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు తిరిగి విధిస్తున్నారు . కాబట్టి ప్రజల అప్రమత్తతను మించిన మందు లేదు . టీకా మందు ఇదిగో , అదిగో వచ్చేస్తున్నదని పాలకులు పబ్బం గడుపుకునే మాటలు చెప్పవచ్చుగాని ప్రస్తుత పరిశోధన దశలను బట్టి అది వచ్చే మార్చి – జూన్ లోపు లభ్యమయ్యే పరిస్థితి లేదు . టీకా మందు వచ్చాక కూడా దాన్ని ప్రజలందరికీ వేయటానికి సంవత్సరంపై గానే సమయం పడుతుంది . అందువల్ల కేసులు తగ్గుతున్నాయని రక్షణా త్మక చర్యలు సడలించవద్దు . చికిత్స కన్నా నిరోధనే ఉత్తమమని విస్మరించరాదు .