telangana lawyers couples murders : కేసీఆర్ ప్రేరెపించడం తోనే లాయర్ దంపతుల హత్య జరిగిందన్న రేవంత్ రెడ్డి…!

telangana lawyers couples murders : పెద్దపల్లి జిల్లా లో జరిగిన లాయర్ దంపతుల హత్య కేసులో తెలంగా పార్టీ పెద్దలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ లు ప్రేరేపించడం వల్లే ఈ దారుణమైన హత్య జరిగిందని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఏమాత్రం జాలి లేకుండా నడిరోడ్డుపై పట్టపగలే విచక్షణా రహితంగా వామనరావు దంపతులను పొట్టనపెట్టుకున్నారని వాపోయారు.
లాయర్ దంపతులైనటువంటి వీరి హత్య కేసులో టీఆర్ఎస్ నేతలు పుట్టా మధు, కుంట శ్రీను కేవలం పాత్రధారులే నాని పేర్కొన్నారు. వీరి వెనకాల ఉన్న పెద్ద తలకాయలు త్వరలో బయటికి వస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే చంపేస్తామని ప్రభుత్వ పెద్దలే సమావేశాలలో బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హాలియా సభలో ప్రతిపక్షాలను తొక్కేస్తామని బెదిరింపు మాటలు మాట్లాడారని చెప్పారు.
టీఆర్ఎస్ నేతల అక్రమాలపై వామనరావు దంపతులు కేసులు వేసి పోరాడుతున్నందుకే ఈ విదంగా పార్టీ పెద్దలు చంపేశారని ప్రజల సమక్షంలో రేవంత్రెడ్డి అన్నారు.