Today Telugu News Updates

తెలంగాణ పై కరోనా వైరస్ పంజా, Telangana Corona cases new record

 రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు తన వ్యాప్తిని పెంచుకుంటూనే ఉంది . Telangana Corona cases new record రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువ అయ్యింది . ఇప్పటి వరకు ఏ రోజు నమోదు కానన్ని పాజిటివ్ కేసులు బుధవారం నమోదయ్యాయి . నిన్నమొన్నటి వరకు 1800 నమోదైన పాజిటివ్ కేసులు బుధవారం ఒక్కసారిగా 1924 కు పెరిగాయి .

 వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం బుధవారం రాష్ట్రంలో 1924 పాజిటివ్ కేసులు నమోదు కాగా , ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,536 కు చేరుకున్నాయి . బుధవారం 6,363 మందిని పరీక్షించగా అందులో 4,439 మందికి నెగిటివ్ , 1924 మందికి పాజిటివ్ గా తేలింది . ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,34,801 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,05,265 మందికి నెగిటివ్ గా తేలగా , 29,588 మందికి పాజిటివ్ గా ఫలితాలు వచ్చాయి . కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి బుధవారం 992 మంది డిశ్చార్జ్ కాగా , ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 11,933 మంది చికిత్స పొందుతున్నారు . ఇప్పటి వరకు 17,279 మంది కరోనా బారినపడి పూర్తిగా కోలుకుని ఆసుపత్రుల నుంచి ఇళ్ళకు వెళ్ళిపోయారు .

Telangana Corona cases new record ::

 కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉంది . కరోనా బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది . ప్రతిరోజూ ఈ మహమ్మారి  బారిన పడి ప్రజలు ప్రాణాలు వదులుతూనే ఉన్నారు . బుధవారం ఏకంగా 11 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు . ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 324 కు చేరుకుంది . బుధవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1590 కేసులు నమోదయ్యాయి . జిల్లాల్లోనూ కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది . గ్రామీణ జిల్లాల్లో నిన్నమొన్నటి వరకు 30 , 40 వరకు నమోదైన పాజిటివ్ కేసులు బుధవారం ఏకంగా వందకు సమీపంగా నమోదయ్యాయి . జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డిలో 99 , మేడ్చల్ లో 48 , వరంగల్ రూరల్ లో 26 , సంగారెడ్డిలో 20 , నిజామాబాద్ లో 19 , మహబూబ్ నగర్ లో 15 , కరీంనగర్ లో 14 , నల్గొండ , రాజన్న సిరిసిల్లలో 13 , వికారాబాద్ జిల్లాలో 11 , వనపర్తి జిల్లాలో 9 , సూర్యాపేటలో 1 , మెదక్ , పెద్దపల్లి , భద్రాది కొత్తగూడెం , యాదాద్రి జిల్లాల్లో ఐదేసి కేసుల పాజిటివ్ కేసుల చొప్పున , ఖమ్మంలో 4 , కామారెడ్డి , జగిత్యాల , ఆదిలాబాద్ , నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడేసి కేసుల చొప్పున , ఆసిఫాబాద్ , నారాయపేట జిల్లాల్లో ఒక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button