Ind vs Aus: భారత్ కు ఇంత ఘోర అవమానమా… బాత్రూమ్ లు కడిగిన టీం ఇండియా క్రికెటర్లు..

ఇటీవలే జరిగిన ఇండియా vs ఆసీస్ రెండు టెస్టుల్లో మొదటి టెస్టులో ఆస్ట్రేలియా నెగగా… రెండో టెస్ట్ లో టీమిండియా వీరోచితంగా పోరాడి చివరి మ్యాచ్ని డ్రా చేసిన సంగతి తెలిసిందే.
ఇంకో మూడో టెస్టు ఈ నెల 15 నుంచి 19 వరకు బ్రిస్బేన్ లో జరుగనుంది. దీంతో ఇండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాల్సివచ్చింది. ఇప్పటికే కరోనా వైరస్ విస్తరిస్తోందిని ఆస్ట్రేలియలో ఆ దేశ ప్రభుత్వం కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ లాక్ డౌన్ తో ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా ఆటగాళ్లు నానా తిప్పలు పడుతున్నారు. వీరికి స్టేడియానికి 4 కిమీ దూరంలో ఉన్న సోఫిటెల్ అనే ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ని కేటాయించారు. లాక్ డౌన్ దృష్ట్యా హోటల్ లో పని చేసే వాళ్ళకి అందరిని యాజమాన్యం ఖాళీ చేయించారు. దీంతో వాళ్ల బెడ్ రూమ్ ని వాళ్లే సర్దుకుంటున్నారు.. వాళ్ల రూమ్ ని వారే శుభ్రం చేసుకుంటున్నారు… వాళ్ళ బాత్రూం వాళ్లే కడుగుకుంటున్నారు.
అలాగే హోటల్ లో ఉన్న జిమ్ ,స్విమ్మింగ్ పూల్ ను కూడా యాజమాన్యం క్లోజ్ చేసింది. భోజనం మాత్రం వేరే ఇండియన్ హోటల్ ను తీసుకువచ్చి హాల్లో పెడుతున్నారు. దీంతో టీమిండియా క్రీడాకారులు ఆస్ట్రేలియా తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బిసిసిఐకి టీమిండియా ఫిర్యాదు చేసింది