టీచర్ ను ఓదార్చిన స్టూడెంట్ … వైరల్ గా మరిన విద్యార్థి లేఖ…!

మన అనుకున్న వారు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవించింన వరికే అర్థమౌతుంది. ఆ బాధను భరించలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మన అనుకునే వాళ్ళు ఓదార్చితే కొంత రిలీఫ్ ఫీలైతూ ఉంటారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. భర్త చనిపోయిన టీచర్‌ను ఒక స్టూడెంట్ అందమైన చేతి వేళ్ళతో , కల్మషం లేని మనసుతో లేఖ రాసి టీచర్ ని ఓదారిచ్చింది.
తనకెంతో నచ్చిన ఆ లేఖను ఆ టీచర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే…..అమెరికాలోని ఒక పాఠశాలలో ‘మెలిస్సా మిల్నర్’ అనే మహిళ టీచర్‌గా జాబ్ చేస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు కారణంగా ఈ మధ్యన ఆమె భర్త చనిపోయాడు. ఈ వార్తను తట్టుకోలేని ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది.
ఆ విషయాన్నీ గమనించిన ఒక స్టూడెంట్ ఆ టీచర్ కి ఓదార్చేందుకు ఒక అందమైన లేఖ రాశాడు. ఆ లేఖలో టీచర్‌పై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తూ… ”ప్రియమైన మిసెస్ మిల్నర్, మీరు భర్తను కోల్పోయినందుకు నేను చాలా బాధకి గురిఅవుతున్నాను. మిస్టర్ మిల్నర్ ని మీరు మళ్లీ చూడకపోవచ్చు. కానీ మీ హృదయాలను కనెక్ట్ చేసే ఓ లైన్ మాత్రం ఉంటుందని మరచిపోకండి. మీరు త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నా..” అంటూ ఆ స్టూడెంట్ లెటర్లో తెలిపాడు. ఈ లెటర్‌కు సోషల్ మీడియాలో చాల లైక్ లు , కామెంట్లు వచ్చి చేరాయి.