Tea Time Business Success Secret : టీ టైం బిజినెస్ 5 లక్షల నుండి 35 కోట్ల వరకు ఎలా?
Tea Time Business Success Secret : టీ టైం.. ఈ టీ పాయింట్ గురించి టీ లవర్స్ కి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలో మంచి ప్రజా ఆదరణ పొందిన టీ టైం ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? ఈ టీ పాయింట్ ని స్థాపించింది ఎవరు? దీని యొక్క టర్నోవర్ ఎంత?

2016లో రాజమండ్రి లోని కడియం గ్రామానికి చెందిన ఉదయ్ శ్రీనివాస్ ఈ ఫ్రాంచెస్ టీ పాయింట్ ని స్థాపించాడు. అప్పటికే ఉదయ్ కిషోర్ కి లక్షలు సంపాదించే ఉద్యోగం ఉంది. ఈయన 2013లో బీటెక్ పూర్తి చేసి దుబాయిలో సాఫ్ట్వేర్ జాబ్ కొన్ని రోజులు చేశాడు. అయితే తనకి బిజినెస్ పైన ఆసక్తి ఉండడంతో జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చాడు. ఇండియాలో 40% కాఫీ తాగే వాళ్ళు ఉంటే..60% టీ తాగే వాళ్ళు ఉన్నారు. అయితే 40% కాఫీ తాగే వాళ్ళుకు స్టార్ బగ్స్ , బరిష్ట వంటి ప్రముఖ కంపెనీలు ఉండగా .. 60 శాతం టీ తాగే వాళ్లకు ఏది లేకపోవడంతో.. ఒక టీ పాయింట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది ఉదయ్ కిషోర్ కి.. దీంతో 2016 లో మొదట రాజమండ్రిలో టీ టైం పేరుతో ఒక షాపు ఓపెన్ చేసాడు. ఆ ఐడియా మంచిగా హిట్ కావడంతో.. అందరి దృష్టి టీ టైం పైన పడ్డది. ఒక్క షాప్ తో మొదలైన టీ టైం ప్రస్తుతం 3,500 ఫ్రాంచిస్ కు చేరుకుంది.

ఇందులో టీ లవర్స్ టీ తాగడానికి అమితాసక్తి చూపడానికి కారణం వాళ్ళ టెస్ట్ అండ్ క్వాలిటీ… ఇంకా వీళ్ళ టీ రేట్లు ఇప్పటినుండి 10 రూపాయల నుండి వంద రూపాయల మధ్యలోనే వుంటుంది. టీ టైమ్ లో వాళ్లు యూస్ చేసే టీ పౌడర్ ఎక్కడ దొరకదు. దీంతో ఒక్కసారి ఆ ఫ్లేవర్ కి అలవాటు పడితే టీ లవర్స్ కి వేరే దగ్గర టీ తాగాలనిపించదు.

ఈ పౌడర్ కోసం అస్సాం నుండి టీ ఆకులు తెప్పించి ప్రాసెస్ చేసి అన్ని ఫ్రాంచిస్ లకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు.అయితే ఈ బిజినెస్ రన్ చేయాలనుకునే వాళ్ళు కేవలం 4.25 లక్షలు కడితే చాలు.. వాళ్లే టీ పౌడర్, రిఫ్రిజిరేటర్స్, స్టీవ్ వంటి 82 రకాల కాంపోనెంట్స్ ని అందిస్తారు. అలాగే వాళ్లకు రెండు రోజులు టీ ఎలా పెట్టాలో ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇంకా వాళ్ళు చాయితోపాటు ఏదైనా ఒక స్నాక్ కూడా అమ్ముకునే ఆప్షన్ ఇస్తారు. ప్రస్తుతం ఈ టీ టైం తెలంగాణ తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ కేరళ ఢిల్లీ గుజరాత్, హర్యానా వంటి 15 స్టేట్స్ లలో దూసుకెళ్తుంది. ఈ టీ పాయింట్ యొక్క టర్నోవర్ 35 కోట్ల వరకు ఉంటుంది. ఐదు లక్షల పెట్టుబడితో మొదలైన ఈ టీ టైం 35 కోట్ల టర్నోవర్ వరకు చేరడం హర్షించదగ్గ విషయం.
