Today Telugu News Updates
అందంగా లేవని నన్నుహీరోయిన్ గా తీసుకోలేదు : తాప్సీ

ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో సినిమా ఇండస్ట్రీలో తాప్సి ఎదుర్కొన్న అనుభవాలను, కష్టాలను బయటపెట్టారు. తనను హీరోయిన్‌గా తీసుకోవడానికి నిర్మాతలు వెనకడుగు వేసేవారని తెలిపింది .
కేవలం అందం విషయంలో సినీ పరిశ్రమలో ఎన్నో అవమానాలు నాకు ఎదురయ్యాయి . కొంతమంది హీరోల భార్యలు నన్ను ఇష్టపడేవారు కాదు. వారి భర్త పక్కన నేను హీరోయిన్‌గా ఒప్పుకొనేవారుకాదు .
నా స్థానంలో వేరే హీరోయిన్‌లకు అవకాశం ఇచ్చేవారు. అలాగే నిర్మాతలు కూడా నన్ను హీరోయిన్‌గా తీసుకోవడానికి చాల ఆలోచించి చివరికి చేతులెత్తేసేవారు .
నాకు తెలిసి ఇలాంటివి నా విషయంలో ఎన్నో జరిగాయి. నాకు తెలియకుండా ఇంకెన్ని జరిగాయో` అని తాప్సీ తన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో జరిగిన విషయాలను బట్టబయలు చేసింది.