Tamilnadu FootBoard Journey: ఫుట్ బోర్డ్ పై ప్రయాణం చేస్తు.. ప్రాణాలు వదిలారు…!…
Tamilnadu FootBoard Journey: మనం ఎప్పటి నుండో ఫుట్ బోర్డ్ ప్రయాణం ప్రమాదకరమని చదువుతున్నాం. కానీ అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు. రోజు రోజుకి ఎన్ని సంఘటనలు, ప్రమాదాలు జరిగినా మార్పు రావట్లేదు.

మనం ఎప్పటి నుండో ఫుట్ బోర్డ్ ప్రయాణం ప్రమాదకరమని చదువుతున్నాం. కానీ అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు. రోజు రోజుకి ఎన్ని సంఘటనలు, ప్రమాదాలు జరిగినా మార్పు రావట్లేదు. ఇటీవలే అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక బస్సులో ఫుట్ బోర్డు పై ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు.

పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తంజావూరు జిల్లాలో తిరువయ్యూర్‌లో కల్లనై నుంచి మన్నార్‌గుడికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ ముందు ఉన్న ట్రక్కు ను ఓవర్ టేక్ చేద్దామని ప్రయత్నించగా.. కానీ అకస్మాత్తుగా విద్యుత్ తీగలకు తగలడంతో బస్సు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురైంది.
దీంతో ఫుడ్ బోర్డ్ పై వేలాడుతున్న ప్రయాణికులో… ఐదుగురు మృతి చెందగా…బస్ లో ఉన్న 10 మంది గాయాల పాలయ్యారు. స్థానికులు గాయపడినవారిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు