health tips in telugu
Tamarind Health Benefits: చింతపండుతో చింతే లేదు..
చింతపండును ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని కొందరి అభిప్రాయం. ఇది తప్పంటున్నారు ఆరోగ్య నిపుణులు. చింతపండును ఆహారంలో తీసుకోవడం పలు రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చని పరిశోధనల్లో తేలింది. దీనిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను ఒకసారి పరిశీలిస్తే..

చింతపండులో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఉండే గుజ్జులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి హాని కల్గించే రాడికల్స్‌తో సమర్థవంతంగా పోరాడుతుంది.
జ్వరంతో బాధపడేవారు చింతపడు చారుని తీసుకోవడం చాలా మంచిది. ఇది త్వరగా జీర్ణమవుతుంది.
చింతపండులోని పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదపడతాయి.