చింతపండు గుజ్జుతో ఊహించలేని అందం మీ సొంతం..
ఆహారానికి పుల్లని రుచిని అందించడంతోపాటు చర్మ ఆరోగ్యాన్ని పెంచే గుణాలు చింతపండులో పుష్కలంగా ఉన్నాయి. చింతపండు గుజ్జుకు తేనె లేదా చందనం లేదా పసుపు లేదా పెరుగును కలిపి ముఖానికి అప్లై చేయడం వలన అన్ని రకాల చర్మ సమస్యలను నివారించవచ్చు.
చింతపండు గుజ్జును ఫేస్‌ప్యాక్‌గా వాడటం వలన ఇది మీ చర్మానికి సహజవంతమైన కాంతిని తిరిగి తీసుకువస్తుంది. ఇందులో ఉండే వివిధ ఆమ్లాలు, అనామ్ల జనకాలు మీ చర్మానికి యవ్వన రూపాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.

చింతపండు గుజ్జులో ఉండే పోషకాలు చర్మపు రంధ్రాలలో ఏర్పడిన దుమ్ము, మలినాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ముఖంపై ఏర్పడే పిగ్మెంటేషన్, మొటిమలను నివారించడంలో చింతపండు అమోఘంగా పనిచేస్తుంది. వారంలో కనీసం ఒక రోజైన చింతపండు గుజ్జు, తేనె, పసుపు లేదా పెరుగును కలిపి ముఖానికి ప్యాక్‌గా వేసుకోవడం ఒక చెప్పుకోదగ్గ సలహా.
ఇందేలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు కంటి క్రింద నల్లటి వలయాలను, మెడ వెనుక భాగంలో ఏర్పడే నల్లధనాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.