Tollywood news in telugu

సినిమా :- అనగనాగ ఓ అతిధి (2020)

anaganaga-o-athithi

anaganaga o athidhi : సినిమా :- అనగనాగ ఓ అతిధి (2020)
నటీనటులు :- పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, వీణ సుందర్, ఆనంద చక్రపాణి
మ్యూజిక్ డైరెక్టర్:-  అరోల్ కొరెల్లి
డైరెక్టర్ :- దయాల్ పద్మన్‌భన్

కథ:-ఈ కథ ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. మల్లిక (పాయల్ రాజ్‌పుత్) ఒక మధ్య తరగతి అమ్మాయి. కుటుంబం తో సహా మల్లిక కూడా ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మల్లికజాతకం చెప్పేవాలని ఎక్కువ నమ్ముతుంది. ఒక రోజు జ్యోతిష్యుడు మల్లిక తో మీ కుటుంబం యొక్క రూపురేఖలు మారె సమయం తొందరలోనే రాబోతుంది. ఒక అతిధి వచ్చి మీకు మరియు మీ కుటుంబం లో ఎన్నో మార్పులు తీసుకొని రాబోతున్నాడు అని చెప్పగా మల్లిక అయోమయంలో పడిపోతుంది. ఆ అతిధి ఎవరు అని మల్లిక ఆలోచిస్తున్న సమయం లో శ్రీనివాస్ (చైతన్య కృష్ణ) అనే వ్యక్తి వచ్చి మల్లికా కుటుంబ కష్ఠాలు అని తొలిగించేస్తాడు. కొని రోజుల తర్వాత మల్లిక పైన శ్రీనివాస్ కు ఉన్న కామం మరియు కోపాన్ని బయట పెడుతాడు. అసలు శ్రీనివాస్ ఎవరు? మల్లికకి అతనికి సంబంధం ఏంటి? ఎందుకు మల్లికా పైన అంత క్రూరంగా ఉన్నాడు ? మల్లిక కుటుంబానికి వచ్చిన ఆర్ధిక ఇబంధులు ఏంటి? చివరికి ఎం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ చిత్రం ఆహ లో చూసేయాల్సిందే.

👍

*  పాయల్ రాజ్‌పుత్ మొదటిసారి గ్లామర్ రోల్ పక్కన పెటేసి కథను నమ్మి ఈ పాత్ర చేయడం ప్రసంశనీయం. సినిమా అంత పాయల్ రాజ్‌పుత్ నటనతో ఒక మెట్టు పైకి లేపింది
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ తమ తమ పాత్రకి న్యాయం చేసారు. 
* కథ చక్కగా వ్రాసుకున్నారు. 
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది. 
*సినిమాటోగ్రఫీ బాగుంది.
*  ప్రొడక్షన్ విలువలు కూడా  బాగున్నాయి.

👎

* సినిమా  నిదానంగా సాగుతుంది. 
* కధనం సరిగా రాసుకోలేక దర్శకుడు కొంత భాగము  విఫలం అయ్యాడు. 
* మొదటి 35 నిముషాలు ఎక్కువ డ్రాగ్ చేసారు.

ముగింపు :-
మొత్తానికి అనగనాగ ఓ అతిధి అనే చిత్రం కథ లో కొత్తదనం కోసం వేచి చూసే ప్రేక్షకులు ఒకసారి చూసేయచ్చు. దర్శకుడు కథను కొత్తగా రాసుకున్నారు. కానీ దాన్నితీయడం లో కొంత భాగము విజయం సాధించారు అని చెపుకోవచ్చు. కథ కొత్తగా రాసుకున్న కమర్షియల్ అంశాలను జోడించడానికి సైడ్ ట్రాక్ అయ్యారని అనిపిస్తుంది. పాయల్ రాజ్‌పుత్ మొదటిసారి గ్లామర్ రోల్ పక్కన పెటేసి కథను నమ్మి ఈ పాత్ర చేయడం ప్రసంశనీయం. సినిమా అంత పాయల్ రాజ్‌పుత్ నటనతో ఒక మెట్టు పైకి లేపింది. కెమెరా పని తీరు కొత్తగా ఉంది. నిర్మాణ విలువలు ఓకే. పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొత్తానికి ఈ సినిమా లో కొత్తదనం లేకపోయినా కథ కొత్తగా రాసుకున్నారు కాబట్టి ఈ వారం లో ఈ సినిమాని ఒకేసారి చూసేయచ్చు.

anaganaga o athidhi రేటింగ్ :- 2/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button