health tips in telugu

కాఫీ తాగండి ఆయుష్షు పెంచుకోండి

నిద్ర లేవగానే చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. చాలా మందికి కాఫీ ఎక్కువగా తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న అపోహ ఉంది. కాని అది నిజం కాదు. అమెరికాలో జరిపిన కొన్ని పరిశోధనలు రోజుకు మూడు నుంచి ఐదు సార్లు కాఫీ తాగడం వల్ల ఎక్కువ రోజులు జీవించవచ్చు అని పేర్కొన్నారు. కేఫిన్ శాతం తక్కువగా ఉన్న కాఫీని తాగడం వల్ల మన ఆయుష్షుని పెంచుకోవచ్చు. కాఫీని ప్రతి రోజు తీసుకోవడం గుండె జబ్బులు, మానసిక ఆందోళన, చక్కర వ్యాధి వచ్చే అవకాశం చాల తక్కువగ ఉంటుంది. మనిషి డిప్రెషన్ కి లోనైనపుడు కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటాడు.

కాఫీని రోజుకు మూడుసార్లు తీసుకునే వాళ్లలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. ధూమపానం, మద్యపానం చేసే వాళ్ళకు కాఫీ త్రాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాట్లు కలవారికీ మాత్రం కాఫీని ఎన్ని సార్లు త్రాగిన వారికి జీవించే కాలం తక్కువగా ఉంటుంది. మన రోజు వారి ఆహారంలో కాఫీని కూడా చేర్చుకోవాలి.కాఫీలో ఉండే ఉత్తేజిత పదార్ధం వాళ్ళ శరీరంలో ఉండే నరాలను,కండరాలను ఉత్తేజితం చేస్తుంది.కాఫీలో ఉండే ఉత్తేజిత పదార్ధం శరీరంలో ఉండే ఇన్సులిన్ ని నియంత్రణలో ఉంచుతుంది. అందువల్ల కాఫీ ఎక్కువ గ తాగే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ. ఎలాంటి చెడు అలవాట్లు లేని వారు రోజుకి మూడు నుంచి ఐదు సార్లు తాగడం వల్ల వారి ఆయుషును పెంచుకోవచ్చు. కానీ గర్భిణి స్త్రీలు, చిన్నపిల్లలు కాఫీని ఎక్కువగా తీసుకోకూడదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button