Tollywood news in telugu

swetha basu prasad : తన జీవితం లో జరిగిన దానికి విడాకులనే పెద్ద పదంతో పోల్చడం ఇష్టంలేదంటున్న శ్వేతా !

swetha basu prasad

swetha basu prasad : తన ఏడడుగుల బంధం కేవలం ఎనిమిది నెలలు కూడా సాగలేదు. ఇలా జరిగినందుకు నటి శ్వేతాబ‌సుప్ర‌సాద్ ఆవేద‌న కు లోనయ్యారు. గతంలో   ‘కొత్త బంగారులోకం’ సినిమాతో  టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కనుమరుగైంది.

తన చిన్న తనంలోనే బాలనటిగానే జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు అందుకున్న శ్వేతా హీరోయిన్ గా పరిచయమై, ఆ త‌ర్వాత ఓ ఊబిలాంటి స‌మ‌స్య‌లో చిక్కుకున్నారు.  పోలీసుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.

ఇక 2018లో డైరెక్ట‌ర్ రోహిత్‌మిట్ట‌ల్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది.  అయితే ఆ ప్రేమ ఎంతో కాలం నిలవలేదు.  ఎనిమిది నెల‌ల‌కే వాళ్లిద్ధ‌రి మూడుముళ్ల బంధం కాస్త ముక్కలైంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న వివాహ బంధం గురించి ఇలా చెప్పుకొచ్చారు. 

మేము కొన్ని అనివార్య కార‌ణాల‌తో వల్ల విడిపోయామని , కొందరి జీవితాల్లో కొన్ని సంవత్సరాలు గడిచాక విడిపోతూ ఉంటారని, కానీ నా జీవితంలో కొన్ని నెలలకే విడిపోయామని దీనికి విడాకులు అనే పెద్దపేరు పెట్టడం తనకి ఇష్టముండదని చప్పుకొచ్చి, ఇది కేవలం బ్రేకప్ లగే భావిస్తున్నానని తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button