health tips in telugu

బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే ఈ స్వీట్ స్నాక్స్ ని ట్రై చేయండి

నేటి ఉరుకుపరుగుల జీవితం, మనం తీసుకునే జంక్ ఫుడ్స్, సరైన వ్యాయామం లేకపోవడం ఇవన్నీ అధిక బరువుకు కారణమవుతున్నాయి. దీనినే ఒబేసిటీ అని కూడా అంటారు. ఒకసారి ఈ సమస్య మొదలైతే ఆ తరువాత అధిక బరువుని తగ్గించుకోవడానికి పడే తంటాలు అన్ని ఇన్ని కావు. ఒక్క సారిగా మీ బరువు తగ్గడానికి  కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం, ఎంతో ఇష్టమైన స్వీట్స్ ని తినకుండా మానేయడం, మరియు వ్యాయామాలు చేయడం లాంటి ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. సరైన టైంలో కొద్ది కొద్దిగా హెల్తీ ఫుడ్ ని తీసుకుంటూ ఒక ఆరోగ్యకరమైన పద్ధతిలో మాత్రమే బరువు తగ్గాలని వైద్యులు కూడా చెపుతున్నారు. బరువు తగ్గాలంటే స్వీట్స్ మీద మీకున్న ఇష్టాన్ని వదులుకోవలసిన పని లేకుండా కొన్ని హెల్తీ స్వీట్ స్నాక్స్ మీకోసమే.

సూపర్ సీడ్స్ పుడ్డింగ్:  ఇది మీకు స్వీట్స్ తినాలనే కోరికకు ఒక హెల్తీ వే. మన హెల్త్ కి మంచి చేసే చియా సీడ్స్, ఫ్లాక్స్-సీడ్స్ మరియు సబ్జా గింజలు లేదా బాసిల్ సీడ్స్ వీటినే సూపర్ సీడ్స్ అంటారు. వీటితో పుడ్డింగ్ చేసుకొని తినొచ్చు.

యోగర్ట్ ని హెల్తీ ఫ్రూట్స్ తో మిక్స్ చేసి తీసుకోవచ్చు: మీకు ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఒక గిన్నెలో పెరుగుతో స్ట్రాబెర్రీస్, మామిడి, ఆపిల్, అరటి, బెర్రీలు లేదా ద్రాక్ష అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ ని మిక్స్ చేసి తీసుకోండి. యోగర్ట్ లో ఉండే ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియా మీ వెయిట్ లాస్ కి సహాయపడుతుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ మన హెల్త్ కి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ముఖ్యంగా ఆపిల్, దానిమ్మ, బెర్ర్రీస్, గ్రేప్ ఫ్రూట్, అవగాడో, ఆరంజెస్ ఫ్రూట్స్ వెయిట్ లాస్ లో కీలకపాత్ర వహిస్తాయి.

హనీ, రోస్టెడ్ ఆల్మండ్స్ మిక్స్: స్వీట్ తినాలనే మీ కోరికను తగ్గించుకోవడానికి తేనే ముఖ్యమైనది. తేనేని మరియు మనకి ఎంతో హెల్ప్ చేసే డ్రై ఫ్రూట్ బాదం పప్పుని రోస్ట్ చేసి కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ కి చాలా యూస్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ గా ఈ మిక్స్ ని తీసుకోవచ్చు. ఈ మిక్స్ లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు మరియు ఫైబర్ వెయిట్ లాస్ కి మెడిసిన్ లా పని చేస్తుంది.

డార్క్ చాక్లెట్:  డార్క్ చాక్లెట్ బార్ లో మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు రెండు పీసెస్ తినండి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లవనోయిడ్స్ అధిక బరువు మరియు ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి.

డార్క్ చాక్లెట్ మరియు బాదం ప్రోటీన్ బార్: ఈ ప్రోటీన్ బార్ చక్కెర తక్కువగా ఉంటుంది మరియు ఇది ప్రోటీన్ మరియు ఫైబర్ తో నిండి ఉంటుంది. మీరు ఈ బార్లను మీతో పాటు తీసుకువెళ్ళవచ్చు మరియు మీకు తియ్యగా తినాలని ఉన్న లేదా ఆకలి వేసినపుడు ఒక హెల్తీ బైట్ గా దీనిని తీసుకోవచ్చు.

ఆల్మండ్ బట్టర్ కుకీస్: స్వీట్స్ తినాలి అనిపించినపుడు స్నాక్స్ గా ఒక బెస్ట్ హెల్తీ ఆప్షన్ ఆల్మండ్ బట్టర్ కుకీలు. ఈ  కుకీల కోసం ఇంట్లో ఉండే పీనట్ బట్టర్ ని కలిపి మీ ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకోవచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button