Suprising Update from Ala Vaikuntapuram lo Movie Producer : ఆలా వైకుంఠపురం లో కాంబినేషన్ రిపీట్ ?:-

Suprising Update from Ala Vaikuntapuram lo Movie Producer : అవును మీరు చదివింది మేము చెప్పింది నిజమే. ఆలా వైకుంఠపురం లో కాంబినేషన్ మరల రిపీట్ అవ్వబోతుంది అని చెప్పకనే చెప్పారు చిత్రబృందం. ఎలా చెప్తున్నాము అనుకుంటున్నారా.
మ్యాటర్లోకి వెళ్తే ఇటీవలే నాగ శౌర్య వరుడు కావలెను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ , త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వరుడు కావలెను సినిమా నిర్మాత సూర్యదేవర నాగ వంశి గారు , మ్యూజిక్ డైరెక్టర్ థమన్. అటుతిరిగి ఇటు తిరిగి అలవైకుంఠపురం లో సినిమా టీం ఆ ఫంక్షన్ కి హాజరయ్యారు.
ఈ ఫంక్షన్ పూర్తయ్యాక బన్నీ , థమన్ , త్రివిక్రమ్ , సూర్యదేవర నాగ వంశి గారు కలిసి ఫోటో దిగారు. అయితే నిర్మాత అయినా నాగవంశీ గారు ట్విట్టర్ లో ఈ నలుగురు దిగిన ఫోటో పెట్టి త్వరలో సప్రైసింగ్ అప్ డేట్ తో రాబోతున్నాం అని ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ గారు మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక హారిక హస్సిన్ బ్యానర్ లో మరల అలవైకుంఠపురం లో బృందం కలవబోతుందని తెలిసింది. బన్నీ కూడా పుష్ప చిత్రం పూర్తయ్యాక త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారాని తెలిసింది.
ఈ క్రేజీ కాంబినేషన్ మరల ఎప్పుడు కలవబోతున్నారనే విషయం ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. త్వరలో నిర్మాత అయినా నాగవంశీ గారు ఈ ప్రాజెక్ట్ మీద మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం మరిన్ని అప్ డేట్స్ కోసం వేచి చూడక తప్పదు.