Sundeep Kishan: వామ్మో సందీప్ కిషన్ ఎయిట్ ప్యాక్ బాడీ ఎలా ఉందో చూడండి…
యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికీ ఎన్నో సినిమాలో హీరోగా నటించిన సరైన గుర్తింపు రాలేదు. హిట్ లు ఫ్లాపులు అన్ని తేడాలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. తాజాగా హీరో సందీప్ కిషన్ నటిస్తున్న 25వ చిత్రం “ఏ1 ఎక్స్‌ప్రెస్” ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది .ఈ పోస్టర్ లో సందీప్ కిషన్ ఎయిట్ ప్యాక్ బాడీతో… ఒక చేతిలో హాకీ బ్యాట్ పట్టుకొని… మరో చేతిని హాకీ డ్రెస్ తో పైకెత్తి.. అబ్బో ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. దీంతో టాలీవుడ్లో మొట్టమొదటి హాకీ చిత్రంగా “ఏ1 ఎక్స్‌ప్రెస్” గుర్తింపు పొందింది.

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతకాలు తెరకెక్కిస్తున్నాయి. సందీప్ కిషన్ కి జోడిగా అందాల భామ లావణ్య త్రిపాఠి నటిస్తుంది. అలాగే ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొల దర్శకత్వం వహిస్తున్నారు.