Skin Care: ఎండాకాలంలో చర్మం నల్లబడకుండా ఉండాలంటే..
ఎండాకాలం చర్మానికి అనేక రకాల సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ముఖ చర్మం చాలా సులభంగా జిడ్డుగా మారి గ్రీస్‌గా తయారవుతుంది. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందవిహీనంగా కనిపించకుండా కాపాడుకోవడమే కాదు, చర్మాన్ని రక్షించుకోవచ్చు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలను పరిశీలిస్తే..
వీలైనంతవరకు సూర్యరశ్మికి దూరం ఉండండి. ప్రత్యేకంగా మిట్ట మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే ముఖాన్ని టవల్‌తో గానీ, మరేదైనా క్లాత్‌తో గానీ కవర్ చేస్కోవాలి.

సూర్యరశ్మిలో ఉండే యూవీ కిరణాలు చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంతేగాక చర్మం వయసు మల్లికను త్వరితపరుస్తాయి. చర్మ క్యాన్సర్‌కు కూడా ఇవి దారి తీస్తాయి.
సన్ స్క్రీన్ లోషన్‌ను వాడటం మర్చిపోకండి. వీలైనంతవరకు మేకప్‌ను తగ్గించండి. హెవీ మార్చురైజర్లు ఎండాకాలంలో చర్మంలోని స్వేద రంధ్రాలను మూసివేయడానికి అవకాశం ఉంది. తద్వారా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది.
ఎక్కువసార్లు మొహాన్ని కడగండి.
ద్రావణాలను ఎక్కువగా తాగండి. ఎంత ఎక్కువగా మంచి నీళ్లు, జ్యూస్‌లు తాగితే అంత ఆరోగ్యం. దీనితో చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.