వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సాధారణంగా వేసవిలో ఎక్కువ మంది డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. ఈ కాలంలో చర్మసంబంధిత వ్యాధులతో పాటు, కళ్ల సంబంధ సమస్యలు కూడా వచ్చే ఆస్కారం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
వేసవిలో శరీరంలోని నీరు చెమట రూపంలో ఆవిరి కావడంతో నీరసం వచ్చేస్తుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్నపిల్లలు, వృద్ధులప ఈ ప్రభావం అధికంగా ఉంటుంది.

వేసవిలో ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎండలోకి వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.
పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచి నీరు తప్పక తాగాలి.
శరీరానికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎండలో ప్రయాణించేవారు గొడుగు, హెల్మెట్ వెంట తీసుకెళ్లాలి.
తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.
వేసవికాలంలో ఆల్కహాల్, పొగతాగడం వంటి వాటికి దూరంగా ఉండండి. వేసవిలో డీహైడ్రేషన్ అనిపించగానే ఎలక్ట్రోలైట్స్ వంటి ఎక్కువ తీసుకోవడం మంచిది.