Tollywood news in telugu

Sumanth Ashwin: ఒక ఇంటివాడైన హీరో సుమంత్ అశ్విన్….ఫొటోస్ వైరల్…!

sumanth ashwin marriage photos

sumanth ashwin marriage photos: టాలివుడ్ లో ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు పుత్రుడు, టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ పెళ్లిచేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో సుమంత్  వివాహం హైదరాబాద్ నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో  కుటుంబ సభ్యుల సమక్షంలో  పెళ్లి జరిగింది.

కోవిడ్ నిబంధనలకు లోబడి కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య  మాత్రమే ఈ వివాహ వేడుకలు జరిగాయి. సుమంత్ ‘తూనీగ తూనీగ’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ‌. ఆతర్వాత ‘ప్రేమకథా చిత్రం-2’  ‘కేరింత’, ‘లవర్స్’‌, సినిమాల్లో నటించాడు.

తాజాగా సుమంత్‌ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు రెడీ అవుతుంది. ఇక ఇపుడు షోషల్ మీడియాలో సుమంత్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button