Tollywood news in telugu

తాతగా నటించడానికి ఆయన కారులోనే వెళ్ళిన మనవడు

నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న చిత్రం తన తండ్రి అయిన నందమూరి తారక రామారావు గారి జీవితకథ. అదే ntr biopic . తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన అలనాటి సాటిలేని మేటి గొప్ప నటుడు ఎన్టీఆర్. బాలకృష్ణ ఎన్టీఆర్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మొదట దర్శకుడు తేజ ఈ చిత్రానికి డైరెక్టర్ గా అనుకున్నారు, కాని కొన్ని అనివార్య కారణాల వల్ల తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలని చేపట్టారు.

బాలకృష్ణ ఈ ntr biopic ప్రతి పాత్రకు తానే స్వయంగా నటీ నటుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్ర అక్కినేని నాగేశ్వరరావు అందులో అయన మనవడు సుమంత్ , చంద్రబాబునాయుడు పాత్రలో దగ్గుబాటి రానా, సావిత్రిగా కీర్తి సురేష్, హెచ్ ఎం రెడ్డిగా ప్రకాష్ రాజ్, కైకాల సత్యనారాయణ, ఎస్వీఆర్ గా నాగబాబుగారు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఎన్టీఆర్ అంటే సినీరంగంలోనే కాకుండా, రాజకీయాలలో గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలుగోడి పౌరుషాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తీ కూడా , కాబట్టి ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ రిలీజ్ చేయనున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ప‌లువురు ప్ర‌ముఖ నటులు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం స్టార్స్ తో నిండిపోయింది.

ఇటీవలే చంద్రబాబునాయడుగా రానా తో చిత్రీకరణ పూర్తి చేసినట్టు సమాచారం, తాజాగా ఇప్పుడు టాలీవుడ్ మరో లెజెండ్ ఏఎన్నార్ పాత్రకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేసారు. ఇందులో ఏఎన్నార్ గా సుమంత్ నటిస్తున్నాడు. నిన్న అంటే బుధవారం షూటింగ్‌కు బ‌య‌లుదేరుతున్న‌ట్టు సుమంత్ ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ntr biopic ఏఎన్నార్ పాత్ర‌లో న‌టించ‌డానికి వెళ్తున్నా. ఏఎన్నార్‌ వాడిన చివ‌రి కారులో నా తొలి రోజు షూటింగ్‌కు హాజ‌ర‌వుతున్నా అని సుమంత్ ట్వీట్ చేశాడు. కారు న‌డుపుతున్న ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. మరి తాతగారి క్యారెక్టర్ లో మనవడు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో తెలుసుకోవాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. సుమంత్ “మళ్లీ రావా” మూవీతో హిట్ అందుకొని ప్రస్తుతం ఇదం జగత్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తుంది. సుమంత్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.

 

 

 

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button