Today Telugu News Updates
RTC బస్సులో ఆత్మహత్య యత్నం !

వారి ఇంటి సభ్యులు పెళ్ళికి ఒప్పుకోలేదని విషం తాగి RTC బస్సెక్కారు బావమరదలు . ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే….. గాంధారి మండలంలోని పెద్దపోతంగల్ గ్రామానికి చెందిన సాయిరామ్, కామారెడ్డి మండలం అడ్లూర్‌కు చెందిన రమ్య ఇద్దరూ వరసకు బావామరదళ్లు అవుతారు .
ఈ నెల 2న బాన్సువాడ పరిధిలోని బోర్లం ఊరికి చెందిన వ్యక్తితో రమ్యకు పెళ్లి ముహుర్తాలు పెట్టుకున్నారు. కానీ రమ్య కి ఈ పెళ్లి ఇష్టంలేదు అందువల్ల తన బావతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్న కొన్నిగంటలకే విషం తాగి ఆర్టీసీ బస్సు ఎక్కారు. కొద్దిసేపటికి స్పృహ కోల్పోవడంతో కండక్టర్ సదాశివనగర్ మండల కేంద్రంలో గుర్తించారు. వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.