Tollywood news in telugu
sudigali sudheer : సుడిగాలి సుదీర్ షూటింగ్ ని అడ్డుకున్న స్థానికులు… నచ్చచెప్పిన పోలీసులు !

సుడిగాలి సుదీర్ ఈ పేరు వినగానే జబర్దస్త్ షో గుర్తుకు వస్తుంది. అంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుదీర్. ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో మ్యాజిక్ లు చేసినవాడు, ఇపుడు టీవీ షోలలో తన నటనతో మ్యాజిక్ లు చేస్తున్నాడు.
విషయానికి వస్తే .. సుదీర్ హీరో గా నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంది. ఇలా షూటింగ్ జరుగుతుండగా అక్కడి ప్రజలు షూటింగ్ ఆపే ప్రయత్నం చేసారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అధిక ప్రజలు నివసించే ప్రదేశంలో షూటింగ్ ఏంటని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు వారు షూటింగ్ జరుపుకోడానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయని తెలిపారు. అయినాగానీ ప్రజలు వినకపోవడంతో పోలీసులు నచ్చజెప్పి ఆ గొడవను సద్దుమణిగేలా చేసారు.