telugu gods devotional information in telugu

నేటి సుబ్రమణ్య ఆరాధన విశేషాలు

ఈరోజు యొక్క విశేషాలు.

ఈరోజు మార్గశిర శుద్ధ షష్టి దీన్నే సుబ్రమణ్య షష్టి అంటారు.స్కాంద పురాణమును అనుసరించి స్వామి ఈరోజే ఆవిర్భవించాడు.ఈరోజు స్వామి ఆలయాల్లో వల్లీ దేవసేనా సమేత సుబ్రమణ్య కల్యాణం చేస్తారు.సు అనగా మంచిది,ఉత్తమ మైన అని అర్ధం.భ్రమణ్య అనగా శుచి అయిన,శుద్ధమైన అని అర్ధం.

దేవతలు అందరిలో అత్యంత శుచి అయిన వాడు ఉత్తమమైన వాడని అంతరార్ధం.సుబ్రమణ్య స్వామికి షణ్ముఖుడు అనే పేరు కుడా కలదు స్వామి అవతార రహస్యం లో స్వామికి షట్ కృత్తిక లు పాలు ఇచ్చి పోషించాయ్.ఈ ఆరు తలలు ఆరు ఋతువులకు ఆరు దుర్గుణాలకు ప్రతీకలు.సుబ్రమణ్య ఆరాధన తో ఆరు దుర్గుణాలను జయించవచ్చు.

ఈరోజు ఉదయాన్నే స్నానం ఆచరించి శ్రద్ద భక్తులతొ స్వామి ఆలయ దర్శనం చేసి యధాశక్తి స్వామి ఆరాధన చేయండి.ఎక్కడైనా కల్యాణం జరుగుతూ ఉంటే వెళ్లి పాల్గొనడం మంచిది.సమస్త దోషాల నివృత్తి కలుగుతుంది.
ఓం శరవణ భవాయ నమః

Read  బ్రహ్మం గారు మొదట తన తల్లిని అలా ఒప్పించాకే జ్ఞాని లా మారాడు.
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button