Tollywood news in telugu

Stylish and Powerful Daniel Sekhar : డేనియల్ శేఖర్ హవా షురూ గబ్బర్ సింగ్ కి గట్టి పొట్టినే :-

Stylish and Powerful Daniel Sekhar

Stylish and Powerful Daniel Sekhar : డేనియల్ శేఖర్ అంటే ఎవరో మీకు తెలుసు కదా , ‘ రానా దగ్గుపాటి ‘ . ‘ పవన్ కళ్యాణ్ ‘ మరియు ‘ రానా దగ్గుపాటి ‘ కలిసి మలయాళం సినిమా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా , మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్టైలిష్ విలన్ గా రానా చేస్తున్నారు.. సినిమాలో వీరి పాత్రల పేర్లు కూడా డిఫరెంట్ గా పెట్టారు ‘ భీమ్లా నాయక్ ‘ గా పవన్ కళ్యాణ్ అయితే ‘ శేఖర్ , డేనియల్ శేఖర్ ‘ గా రానా కనిపించబోతున్నారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా” భీమ్లా నాయక్ ” పాత్రా కి సంబంధించిన పాట మరియు పవన్ వీడియోస్ చూసి అభిమానులకు డబల్ ధమాకా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈరోజు ‘ డేనియల్ శేఖర్’ గ్లింప్సె రిలీజ్ అయింది. అందులో రానా స్టైల్ కానీ , మ్యానరిజం కానీ పవన్ కి గట్టి పోటీనే అని అనిపించేలా ఉన్నాయి.

బ్లాక్ షర్ట్ మరియు వైట్ పంచతో రానా పలికిన డైలాగులు ఇప్పటికి మైండ్ లో అలాగే మారుమ్రోగుతున్నాయి. ” నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా స్టేషన్ లో టాక్ నడుస్తుంది. నేనెవరో తెలుసా ధర్మేంద్ర.. హీరో ”.

ఈ డైలాగు రానా చెప్తుంటే రానా ఫ్యాన్స్ ఏ కాదు పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా వీడియో తో ఫుల్ ఖుషి అయ్యారు. 30 సెకండ్ల వీడియో ఏ ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మరి. జనవరి 12 న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button