Viral news in telugu

హోం వర్క్ నుంచి బయటపడేందుకు…. అత్యాచారం డ్రామా ఆడిన విద్యార్థిని… !

 student  played  rape drama

స్కూల్ లో ఇచ్చిన హోం వర్క్ నుండి తప్పించుకునేందుకు అత్యాచారం డ్రామా ఆడింది ఒక  విద్యార్థిని. అది నిజమే అనుకోని  వైద్య పరీక్షల చేయించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించగా,ఆ యువతి  చెప్పింది విని పోలీసులు ఆశ్చర్యపోయారు.  ఈ ఘటన  కర్ణాటకలో జరుగగా విషయం కాస్త  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం మేరకు.. . ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపుర మండలం  నందొళ్లి గ్రామానికి చెందిన యువతి  పదో తరగతి చదువుకుంటుంది. ఒక రోజు పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోలేదు.  చీకటి పడటంతో కంగారుపడిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతి  కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలా వెతుకుతున్న  క్రమంలో గ్రామ సమీపంలోని అడవిలో యువతి కంటపడటంతో అంత ఊపిరి పీల్చుకొని,  ఆమెను  పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అటుపిమ్మట అసలేం జరిగింది అని బాలికను ప్రశ్నించగా తనను ముగ్గురు వ్యక్తులు అడవిలోకి తీసుకెళ్లి  అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. కానీ  వైద్య పరీక్షల్లో మాత్రం అత్యాచారం లాంటిది ఏమి జరగలేదని రిపోర్ట్ లో తెలుస్తుంది. 

దీంతో బాలికను పోలీసులు గట్టిగా అడిగే సరికి  అసలు విషయం చెప్పింది. హోం వర్క్ చేయలేదని, దాని నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామా  ఆడినట్టు వెల్లడించింది.ఇది విన్న పోలీసులు ఆ యువతిని మందలించి ఇంటికి పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button