News
Karimnagar : కరీంనగర్ లో స్ట్రెయిన్ వైరస్ టెన్షన్ !

Karimnagar : గతం లో ఢిల్లీ నుండి వచ్చిన కొంత మంది వ్యక్తుల వల్ల కరోనా వైరస్, కరీంనగర్ నగరాన్ని వణికించింది. ఇపుడు జిల్లాకు బ్రిటన్ నుండి 16 మంది వ్యక్తులు రావడంతో జిల్లా వాసులు బయాందోనళకు గురిఅవుతున్నారు. ఇప్పటికే స్ట్రెయిన్ అనే కొత్తరకం వైరస్ బ్రిటన్ ప్రజలను అతలాకుతలం చేస్తుంది. ఇపుడు బ్రిటన్ నుండి కరీంనగర్ కు వచ్చిన వారి వల్ల స్ట్రెయిన్ వైరస్ కరీంనగర్ ప్రజలకు సోకె ప్రమాదం ఉండడంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు.
బ్రిటన్ నుండి వచ్చిన ఆ 16 మంది గురించి ఆరా తీస్తున్నారు. ఇందులో 10 మంది శాంపిల్స్ తీసుకోగా , మిగిలిన ఆరుగురి ఆచూకీ గాలిస్తున్నారు. ఈ 16 మంది వ్యక్తుల ను పరీక్షిస్తే గాని కరీంనగర్ ఈ కొత్తరకం వైరస్ వలయంలో చిక్కుకుంద లేదా అనే విషయం తెలిసే అవకాశముంది.