కార్తీక చతుర్దశి పురాణ కథనం
కార్తీక శుద్ధ చతుర్దశి యొక్క పురాణ కథనం.
హరిహరులు ఇరువురికి ప్రీతివంతమైన రోజున ప్రతీరోజు ఒక పురాణ కథనంతో ముడి పడి ఉంటుంది. అలాంటి నేటి కథ.
ఒకానొక సమయాన రాక్షసుల ప్రవృత్తి వల్ల లోకాలకు శాంతి లేకుండా పోయింది. రుషుల యొక్క యజ్ణ యాగాలకు అటంకాలు కలిగిస్తూ దేవతలకు హవిస్సులు అందకుండా చేసేవారు. భూలోకం మాత్రమే కాకుండా దేవలోకం మీద కూడా దండెత్తిన సమయాన ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరకు పోయి శరణు జొచ్చాడు. విష్ణుమూర్తి కూడా ఎటు పాలు పోక శివారాధన కు ఉపక్రమించాడు. అందుకు వేయి దివ్య పుష్పాలు సేకరించాడు.శివ మాయ వల్ల అఁదోక పుష్పము మాయం అయింది. ఒక్కొక్క నామం జపిస్తూ శివునికి సమర్పణ చేస్తు ఉండగా సహస్రం లో ఇంకొక నామం ఉండగానే పూల బుట్ట ఖాళీ అయింది. దీంతో ఆ కమల నయనుడు పుష్పం బదులు తన కన్ను సమర్పణ చేయుటకు సిద్ధ పడగా . . . లోక రక్షణ దుష్ట శిక్షణ పట్ల తన సంకల్ప బలాన్ని మెచ్చుకుని తాను స్వయంగా తయారు చేసుకున్న ఆయుధం చక్రాన్ని విష్ణు మూర్తికి ప్రసాదించాడు.
ఈ సుదర్శన చక్రానికి తిరుగు లేదు. ఎంతటి బలవంతులు అయినా ఈ సుదర్శన చక్ర బలం ముందు తల వంచవలసిందే. లక్ష్యం పూర్తి చేసి తిరిగి నిన్ను చేరుతుందని శివుడు చెప్పాడు విష్ణుమూర్తి కి. కొన్ని ప్రముఖ విష్ణు క్షేత్రాలలో ఈ వైకుంఠ చతుర్దశి ని ఘనం గా చేస్తారు.