Tollywood news in telugu

పవన్ కు తగ్గని అభిమానం

రేణు దేశాయ్ వెంట ఇంకా వెన్ను దన్నుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడా ? ? ?

రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు హీరోహీరోయిన్ లుగా ఒక్కటైన జంట. ప్రస్తుతం రేణు దేశాయ్ వేరే పెళ్ళి చేసుకుంది. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. అయితే విడిపోయినా కూడా రేణు కు ఇప్పటికీ పవన్ సప్పోర్ట్ గా ఉన్నాడని అనిపిస్తుంది మీడియాకు . అలాంటి వార్తలకు కొంత బలమైన సమాచారం లేకపోలేదు.

ఇటీవల రేణు దేశాయ్ రాసిన లవ్ అన్ కండీషనల్లి పుస్తకం విడుదల అయింది. ఆ ప్రేమ కవితల సంకలనాన్ని తెలుగు గీత రచయిత అనంత శ్రీ రామ్ అనువాదం చేశారు. ఇటీవల ఈ పుస్తకం ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన రేణు దేశాయ్ ను ఇంటర్వూ చేశాయి చాలా చానల్స్ అయితే జనసేన పవన్ ఛానల్ గా పేరున్న 99tv మాత్రం ఈ పుస్తక ప్రమోషన్ ఇంటర్వూ ప్రత్యేకంగా ప్రమోషన్ చేసింది. దాంతో పవన్ కు ఇప్పటికీ రేణు దేశాయ్ మీద అభిమానం ప్రేమ తగ్గలేదని పుకార్లు పుట్టాయి. అయితే పవన్ టీం మటుకు నిర్ద్వంద్వము గా ఈవార్తల్లో నిజం లేదని కొట్టి పారేశాయి.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button