SBI Alert: మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా ఐతే వెంటనే PAN కార్డ్ లింక్ చేసుకోండి.. లేకపోతె… !

State Bank of India Alert : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతన కస్టమర్లను అలర్ట్ చేస్తుంది. ఇకనుండి నగదు ట్రాన్స్ఫర్ వంటి లావాదేవీల విషయంలో ఖాతాదారులను హెచ్చరించింది. ఇప్పటినుండి ఎలాంటి అంతరాయం జరుగకుండా అంతర్జాతీయ లావాదేవీలను చేసుకోవాలంటే, బ్యాంకు ఖాతాతో మీ పాన్ నంబర్‌ను లింక్ చేసుకోవాలని SBI సూచించింది.
మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్ కి వెళ్లి పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు , ఒక మీకు టైం లేకుంటే ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేకుండానే పాన్ నంబర్‌ను ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసుకొనే వీలుంది.
ఎస్బీఐ కి దేశవ్యాప్తంగా 40 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. వీరు అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ జరపాలన్న లేదంటే మీరు విదేశాలకు వెళ్ళినపుడు అక్కడి ఎస్బీఐ ఏటీఎం కార్డు వినియోగించాలన్నా మీ PAN కార్డును బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకోవాలని SBI తమ ఖాతాదారులకు తెలిపింది.