Movie Sequels: సీక్వెల్స్ బాటలో స్టార్ హీరో లు … పక్కా ప్లానింగ్ తో ముందుకు…!

Movie Sequels: ఈ రోజుల్లో సినిమా మేకర్స్ పక్కా ప్లాన్ తో సీక్వెల్ బాటలో నడవటానికి సిద్ధమవుతున్నారు. రకరకాల కథలను తీసే బదులు ఒక పర్ఫెక్ట్ కథను తయారుచేసి ఆ కథను రేండు భాగాలుగా తీసే పనిలో నిమగ్నమౌతున్నారు.
ఈ ఫార్ములా తో ఇదివరకే హిట్ కొట్టిన రాజమౌళి సినిమా బాహుబలి ని ఆదర్శంగా తీసుకొని, మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. అలాగే కేజిఎఫ్ మేకర్స్ కూడా రాజమౌళి ఫార్ములాను అప్లై చేసి విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే.
ఇక పుష్ప మూవీ ని ఒకే పార్ట్ గా విడుదల చేద్దామనుకున్నవారు. ఇపుడు కంటెంట్ బాగుండటంతో రెండు భాగాలుగా తీద్దామని అనుకుంటున్నారు. ఇందుకోసమని స్క్రిప్ట్ ని కూడా రెడీ చేస్తున్నారు.
అదేవిదంగా ఈ ఫార్ములాతో అటు తమిళ ఇండస్ట్రీ మరియు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సక్సెస్ కావడం మనం చూసాము. ఇపుడు ఇదే ట్రెండ్ తెలుగు ఇండస్ట్రీ లో మొదలైంది. మరి ఈ Movie Sequels బాటలో ఎంత మంది మేకర్స్ సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.