Tollywood news in telugu

SRK Grand OTT Entry : ఓటీటీ లో అడుగుపెట్టనున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ :-

SRK Grand OTT Entry

SRK Grand OTT Entry : ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం అయింటది. బాలీవుడ్ కింగ్ ఖాన్ అంటే ఎవరో కాదు మన షారుఖ్ ఖాన్. బాలీవుడ్ లో ఆయనని కింగ్ ఖాన్ అని పిలవడం అలవాటు.

ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ ని వెండితెర పైన చూసి దాదాపు 3 ఏళ్ళు దాట్టిపోయింది. చివరిగా విడుదలైన చిత్రం జీరో. ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా షారుక్ ఎప్పటికి బాద్షా అని నిరూపించాడు. జీరో తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నపటికీ ఏది రిలీజ్ కి సిద్ధంగా లేదు.

షారుక్ ప్రస్తుతం పాతన్ మరియు తమిళ డైరెక్టర్ అట్లీ సినిమాలతో బిజీ గా ఉన్నారు. అయితే ఈ రెండు సినిమాలు థియేటర్ లో ఇప్పట్లో రావు అని అర్ధం అయింది. అందుకే షారుక్ వీటికంటే ముందే తన అభిమానులకు వేరే రూపంలో కనబడాలి అనుకున్నారేమో. అదే ప్లాన్ లో ఉన్నారని చిత్రసీమ లో టాక్.

అయితే షారుక్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ చేయబోతున్నాడని అర్ధం అయింది. ఇటీవలే షారుక్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు. అందులో కామెడీ గా లాక్ డౌన్ కారణంగా అందరు హీరోలు ఓటీటీ లో వారి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అని ఒకరు అడగక దానికి షారుక్ పిక్చర్ అభి బాకీ హాయ్ మేరె దోస్తో అని సమాధానం ఇచ్చారు.

దీనికి కరన్ జోహార్ కూడా స్పందించి ఎపుడు ఇలాంటి ఒక రోజు వస్తది నేను చూస్తాను అని అనుకోలేదు ఈరోజు చుసేశాను అని అభిమానులకి హింట్ ఇచ్చారు. దానికి కూడా షారుక్ సమాధానం గా పిక్చర్ అభి బాకీ హాయ్ మేరె దోస్తో అని చెప్పారు.

దీని బట్టి షారుక్ త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నారు. అది ఏ రేంజ్ లో ఉండబోతుందో వేచి చూడాలి. త్వరలో మిగితా విషయాలు అధికారికంగా ప్రకటిస్తారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button