Tollywood news in telugu

శ్రీవిష్ణు హీరోగా ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్య‌ ప్రొడ‌క్ష‌న్ నెం.3 చిత్రం

శ్రీవిష్ణు హీరోగా ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్య‌ ప్రొడ‌క్ష‌న్ నెం.3 చిత్రం

డిఫ‌రెంట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుల్లో శ్రీవిష్ణు ఒక‌రు. ఈ ఏడాది `బ్రోచేవారెవ‌రురా`తో సూప‌ర్‌హిట్ సాధించారు. వైవిధ్య‌మైన క‌థ‌, క‌థాంశాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే శ్రీవిష్ణు న‌టించ‌బోయే కొత్త చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మి రోజున ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. డిఫ‌రెంట్ పోలీస్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు పోలీస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.  శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ వ‌ర్మ‌
నిర్మాత‌: ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు)
బ్యాన‌ర్‌: ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ:  శేఖ‌ర్ వి.జోసెఫ్‌
ఆర్ట్‌:  వివేక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button