Today Telugu News Updates

srisailam : శ్రీశైలంలో చికెన్..చికెన్…మటన్..మటన్ !

srisailam issue latest

srisailam : ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి  శ్రీశైలంలో ఘోర అపచారం జరిగింది.  శ్రీశైలంలోని కొన్ని ప్రాంతాలకు చికెన్, మటన్ ను సరఫరా చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ పనిచేస్తున్న కొందరిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసులు  తనిఖీలు చేస్తుండగా ఈ విషయం బయటపడింది. 

కొంత మంది వ్యక్తులు నిబంధనలు విరుద్దంగా శ్రీశైలం లో మాంసం తరలిస్తుండగా దొరికిపోయారు. వీరందరూ సున్నిపెంట నుంచి శ్రీశైలంకు చికెన్, మటన్ లను  తరలిస్తున్నారు.  వీరి వద్ద  20 కిలోల మటన్  పట్టుబడినట్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహారెడ్డి వెల్లడించారు.

మాంసాన్ని తరలిస్తున్న వారిని శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలంలో మాంసం, మద్యం నిషేధం. అయితే ఆ నిబంధనలకు విరుద్దంగా కొంతమంది ఇలా చేయడంతో చివరికి పోలీసులకు చిక్కారు.

ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఇలాంటివి  జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారి ఆవేదన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button