Today Telugu News Updates
sripad nayak car accident : కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారుకు ఆక్సిడెంట్…మృతిచెందిన భార్య !

కేంద్ర ఆయుర్వేద, యోగా & ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వ శాఖా మంత్రిగా ఉన్న శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ కర్ణాటక అంకోలా జిల్లా లో జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీపాద్ నాయక్ భార్య విజయ అక్కడిక్కడే మృతి చెందారు. అంతేకాకుండా నాయక్ పర్సనల్ సెక్రటరీ దీపక్ రామ్దాదా గోమ్ కూడా చనిపోయినట్లు సమాచారం.
శ్రీపాద్ నాయక్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు .వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.