Sri Reddy: సమంతా నువ్వు హాట్ గా లేవంటూ..సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

ప్రముఖ అగ్ర కథానాయకి సమంతా యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె జోరు తగ్గలేదు. తనకు నచ్చిన టీవీ షో లో, ఓటీటీ లో టాక్ షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా తన డ్రెస్సింగ్ పై నటి శ్రీరెడ్డి వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు.

“సమంతా నీ డ్రెస్సెస్ ఏంటి? ఆ బీభత్సం ఏంటి? అక్కినేని కుటుంబంలో అమల ఏంత మంచిగా డ్రెస్ వేసుకుంటారు… మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటికీ ఆమెని చూస్తే యంగ్, ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. అలాగే పశువుల మీద ఉన్న ప్రేమతో ఆమె స్థాపించిన సంస్థ దాంతో పాటు పిల్లలను చూసుకునే విధానం..అదంతా చాలా బాగుంటుంది. నాకు వ్యక్తిగతంగా నాగార్జున అంటే ఇష్టం ఉండదు..కానీ ఓ అభిమానిగా సమంత ని డ్రెస్సింగ్ సెన్స్ నాకు నచ్చడం లేదు.. ఇప్పుడు నమ్రతా ను చూడండి.. మహేష్ బాబు కి ఎంత సపోర్టుగా ఉండి సూపర్ స్టార్ గా ఎదగడానికి మూల కారణం అయింది. అలాగే నాగ చైతన్య కి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హిట్స్ లేవు,ఇంకా క్రేజ్ కూడా లేదు. సమంత నువ్వు కూడా అతని కెరియర్ చూసుకోవచ్చు కదా…! ఈ బట్టలు ఇప్పుకుని ఆ రచ్చ ఎందుకు? ఆ డ్రెస్ లు నికేమైన బాగున్నాయంటే… అసలు నీకు సెటే కాలేదు. సమంత నువ్వు హాట్ గా ఉండవు…క్యూట్ గా ఉంటావు.. దయచేసి ఆ డ్రెస్సులు వేసి జనాలను ఇబ్బంది పెట్టకు.. మనం తెలుగు నారీమణులం నువ్వు నువ్వు తమిళ్ అమ్మాయివి…తెలుగు అబ్బాయిని వివాహం చేసుకున్నావ్… పెళ్లి చేసుకున్న తరువాత లిమిట్స్ దాటకూడదు…కానీ నువ్వు క్రాస్ చేశావ్.. అందుకే నువ్వు నచ్చడం లేదు.. నాగచైతన్య ప్రొఫెషనల్ కెరియర్ పై సమంత కాన్సంట్రేషన్ పెట్టాలని శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.