Sreedevi Soda Center Review : శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రివ్యూ

Sreedevi Soda Center : సినిమా :- శ్రీదేవి సోడా సెంటర్ (2021), నటీనటులు:- సుధీర్ బాబు, ఆనంది, నరేష్, పావెల్ నవగీతన్, రఘు బాబు, అజయ్, సత్యం రాజేష్, సప్తగిరి, నిర్మాతలు:- విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, డైరెక్టర్ :- కరుణ కుమార్
లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్ ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే శ్రీదేవి సోడా సెంటర్ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ :-
ఈ కథ అమలాపురంలో సూరిబాబు(సుధీర్ బాబు) మరియు శ్రీదేవి( ఆనంది) సన్నివేశాలతో మొదలవుతుంది. సూరిబాబు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుండగా శ్రీదేవి ప్రేమలో పడుతాడు. అయితే క్యాస్ట్ ప్రాబ్లెమ్ కారణంగా శ్రీదేవి నాన్న అయినా ( నరేష్ ) మరియు గ్రామా పెద్దలు ఈ జంటపైనా ఎన్నో సమస్యలలో ఇర్రుకునేలా పన్నాగాలు చేస్తారు. ఈ సమస్యల నుంచి సూరిబాబు ఎలా బయటపడ్డాడు? అసలు ఆ సమస్యలు ఏంటి ? సూరిబాబు ఎందుకు జైలు కి వెళ్లాల్సి వచ్చింది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
👍🏻:-
- కథ మరియు కథనం బాగున్నాయి. సుధీర్ బాబు సినిమా మొత్తాని తన భుజాలా పై వేసుకొని నడిపించేశారు.
- దర్శకుడు తనదైన శైలితో బాగా తీశారు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్.
👎🏻:-
- ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
ముగింపు :-
మొత్తానికి శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా కథ మరియు కధనం పరంగా ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది. కాకపోతే మొదటి భాగం లో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అవి ఓర్చుకొని చూస్తూ సెకండ్ హాఫ్ లో అడుగు పెడితే సూపర్ ఉంటుంది సినిమా. దర్శకుడు చాల బాగా రాసుకున్నారు మరియు తెరకేక్కిన్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ సినిమా కి ప్రాణం పోసింది. మొత్తానికి ఈ వారం ఈ సినిమా ని కుటుంబం అంత కలిసి చూసేయచ్చు.
Rating:- 3/5