telugu cinema reviews in telugu language

SR Kalyana Mandapam – SR కళ్యాణమండపం(2021)

 SR kalyana mandapam 2021

సినిమా :- SR kalyana mandapam 2021

నటీనటులు :- కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ల భరణి

నిర్మాతలు:- : ప్రమోద్

డైరెక్టర్ :- శ్రీధర్ గాదె

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో కిరణ్ అబ్బవరం నటించిన SR కళ్యాణమండపం ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే SR కళ్యాణమండపం వచ్చింది. ఇపుడే సినిమా ఎలా ఉందొ చూద్దాం.

SR kalyana mandapam story

ఈ కథ కడప జిల్లాలోని చిన్న పట్టణంలో కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) ని, మరియు ప్రియాంక మీద అతనికి ఉన్న అపారమైన ప్రేమను చూపిస్తూ మొదలవుతుంది. కానీ అందరికి కళ్యాణ్ ప్రేమ విషయం తెలుసు , కాకపోతే కళ్యాణ్ మరియు అతని తండ్రి సాయి కుమార్ గత 10 సంవత్సరాలుగా మాట్లాడుకోవడం లేదు అని ఎవరికీ తెలియదు. అస్సలు తండ్రి కొడుకుల మధ్య దశాబ్దకాలం మాటలు నిలిచిపోవడానికి కారణం ఏంటి? అసలు ఎం జరిగింది ? వీటి మధ్య ఎస్ఆర్ కళ్యాణమండపం ఏంటి ? చివరికి ఎం జరగబోతుంది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

👍🏻:-

  • కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ , సాయికుమార్ ముగ్గురు తమ పాత్రలో మునిగిపోయి నటించేసి సినిమాని ఒక మెట్టు పైకి ఎక్కించారు.
  • తండ్రి కొడుకుల సన్నివేశాలు బాగున్నాయి.
  • పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
  • సినిమాటోగ్రఫీ బాగుంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

👎🏻:-

  • ఎలేవేషన్స్ కోసం సీన్స్ రాసుకోవడం.
  • కథ, కధనం రొటీన్.
  • డైరెక్షన్

ముగింపు :-

మొత్తానికి SR కళ్యాణమండపం అనే సినిమా హైప్ లేపినంత అయితే లేదు అని చెప్పుకోవాలి. దర్శకుడు పాత కథని కొత్త కథనం తో చుపియాలనుకొని అనవసరపు సన్నివేశాలతో బోర్ కోటిస్తాడు. కిరణ్ , ప్రియాంక మరియు సాయికుమార్ నటనకు సినిమాని ఓసారి చూసేయచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాలేదు. మొత్తానికి ఈ సినిమా ఈ వారం ఓసారి అందరి నటన కోసం చూసేయచ్చు.

SR kalyana mandapam rating :- 2.75/5 (Hit)

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button