నేటి కార్తీక శుద్ధ నవమి విశేషం
నేటి విశేషం కార్తీక శుద్ధ నవమి
ఇది కృత యుగము ఆరంభమైన రోజు.ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలానికి గుర్తు.అలాంటి పుణ్య ప్రదమైన రోజున ధర్మ దేవతను ఆరాధన చేయాల్సిన రోజు.ధర్మాన్ని వృషభ రూపం లో చూసిన కాలం నేటి కలియుగము లో ధర్మము ఒంటి కాలు మీద కుంటుతుంది అని అంటారు పెద్దలు ధర్మానికి తగ్గట్టుగానే నేటి కాలమాన పరిస్థితులు ఉన్నాయ్.కృత యుగం నాడు చెడు అనేది రెండు వేర్వేరు లోకాలలో ఉండేది.దుర్గుణాలు గల రాక్షసులు నేల మీద కాక వేరే లోకంలో అనగా అంతరిక్షంలో ఉండేవారు.ప్రజలు ధర్మ ప్రవర్తనతో సుభిక్షంగా ఉండేవారు.దొంగతనము , ఆకలి తో బిక్షాటన , దోపిడీ లాంటివి ఉండేవి కాదు.
నేడు అలా కాదు ప్రస్తుతము ఆ కాలం తో పోలిస్తే నేడు అన్ని పెచ్చుమీరి పోయాయి. మన ప్రవర్తనలు బట్టి కాలం ఫలితాలు ఇస్తుంది.నేటి కరువులు , దోపిడీలు , దొంగతనాలు ఇలాంటివే.కలియుగం లో కేవలం భగవన్ నామం మాత్రమే ప్రజలను రక్షిస్తుంది.ముఖ్యంగా గోవింద నామం.కాబట్టి జనులంత గోవిందుని కీర్తించి
తరించ వచ్చు.