telugu gods devotional information in telugu
సోమవారం ఏకాదశి విశిష్టత
కార్తీక సోమవార శివారాధన విశిష్టత.
నేడు కార్తీక సోమవారం మరియు ఏకాదశి కలసి ఉన్న అద్భుతమైన రోజు.హరిహరులకు ఇరువురుకి ఇష్టమైన మాసంలో వారిరువురు ఇష్టపడే రోజు.మిగతా రోజుల్లో పూజాధికాలు,అర్చనలు,అభిషేకాలు చేయలేని వాల్లు ఈ ప్రత్యేకమైన రోజున చేయడం వల్ల మాసమంత చేసిన పుణ్య ఫలితం వస్తుంది.
రేపు ఉదయం పూర్వమే నిద్రలేచి స్నానంచేసి శివాలయం చేరుకుని దీపారాధన చేయండి.రుద్రాక్షలు,విభూతి ధరించి శివుని స్తోత్రాలు కాని నూటఎనిమిది నామాలు కాని స్మరణ చేయాలి.బిల్వ పత్రాలతో,శుద్ధ జలాలతో అభిషేకము చేయాలి.వీలయితే విష్ణుమూర్తి కి తులసిమాల వేసి ఉపవాసం ఉండాలి.హరి నామ సంకీర్తనవల్ల పుణ్యలొకాలు సంప్రాప్తిస్తాయి అని కార్తీక పురాణమహాత్మ్యం తెలుపుతుంది.
ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ