telugu gods devotional information in telugu

కార్తీక పౌర్ణమి విశిష్టత

కార్తీక పౌర్ణమి యొక్క విశేషాలు

చంద్రుడు 27నక్షత్రాలలో ప్రతినెలా పౌర్ణమి రోజున ఉండే నక్షత్రాన్ని బట్టి ఆయా నెలలకు ఆ మాసం పేరుగా ఉంటుంది. ఇక పోతే కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున సంభవిస్తే అది కార్తీక పౌర్ణమి గా అది కార్తీక మాసం గా పేరు పొందుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి మాహా పర్వదినం. శివ భక్తులకు ఇది మరో మహా శివరాత్రి తో సమానం.

ఈ కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అంటారు. ఆశ్వీయుజ బహుళ అమావాస్య మనుషులకు దీపావళి కాగా, లోక కంఠకుడు అయినటువంటి తారకాసురున్ని శివ పుత్రుడు సుబ్రమణ్య స్వామి వధించుట జరిగింది ఈరోజే. అందుకే ఈ రోజు దేవ దీపావళి గా పేరు గాంచింది. ఈరోజున సమస్త దేవతలు తులసి , ధాత్రిల కళ్యాణం లోనూ , కైలాసంలో జరిగే విశేష సేవల్లో పాల్గొంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు చేసే ప్రతి శుభవంతమైన పని హరిహరుల అనుగ్రహమును కలిగిస్తుంది. ఈరోజు సంవత్సరం లో ఎప్పుడు దీపారాధన చేయని వాళ్లు ఈ ఒక్కరోజు శివాలయం లో దీపం వెలిగించినా కూడా అనంత ఫలితం ఇస్తాడు మహదేవుడు అని పురాణాలు చెబుతున్నాయి.
ఓం నమః శివాయ

Read  బ్రహ్మం గారు మొదట తన తల్లిని అలా ఒప్పించాకే జ్ఞాని లా మారాడు.
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button