telugu gods devotional information in telugu

speciality of ekadashi saturday

నేటి విశేషం ఆశ్వీయుజ బహుళ ఏకాదశి మరియు శనివారం చాలా అద్భుతమైన యోగవంతమైన రోజు, నారాయణునికి ఏకాదశ తిధి అన్నది ఎంతో ప్రీతి అయినది. ఈరోజున ఉన్న ఏకాదశి కి రమా ఏకాదశి అని పేరు.
రమా అనిన అమ్మ వారు మహాలక్ష్మి రూపాన్ని తెలియ జేస్తుంది.అమ్మవారు సాక్షాత్ అయ్య వారి యొక్క శక్తి స్వరూపం. ఈ ఏకాదశి వ్రతం చేయాలి అంటే ముందు రోజు అనగా దశమి నాడు ఉపవసించి ఏకాదశి అంతా ఉపవసించి తిరిగి ద్వాదశి రోజున పారాయణ చేసి ఆరోజు కూడా ఉపవాసం ఉంటే అది పరిపూర్ణ ఏకాదశి వ్రతం అవుతుంది. ఇలాగ వీలుకాని పక్షం లో ఉదయం సంకల్పం చెప్పుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత యధాశక్తి నారాయణ పూజ అనంతరం ఫలాహారాన్ని తీసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఉపవాసం అనిన భౌతిక అర్దం ఏమైనప్పటికీ అంతరార్థం మాత్రం భగవంతునికి చేరువ లో ఉండటం మాత్రమే . . . కాబట్టి వీలయిన వారు నారాయణుల కరుణ కోసం ఏకాదశి వ్రతం పాటించండి.
ఓం నమో నారాయణాయ

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button