telugu gods devotional information in telugu

శివ పూజలో బిల్వపత్రం విశిష్టత

మహాదేవునికి భోళా శంకరుడు అన్న పేరు కలదు.పరమ భక్తితో సేవించి పిలిచిన వారిని , తలచిన వారిని , కొలిచిన వారిని చివరకు రాక్షసులసైతం కరుణించు కరుణా మూర్తి పరమ శివుడు.

పరమ శివుడు సులభంగా సంతసించే వాటిల్లో ఒకటి మారేడుదళం , దీన్నే బిల్వం అని అంటారు. బిల్వం సాక్షాత్ లక్ష్మి స్వరూపం అని పేర్కొంటారు పెద్దలు.ఏక బిల్వం మొదలు అనేక రకాలైన బిల్వ పత్రాలు ఉంటాయ్ , త్రిదళ బిల్వాలు అధికంగానే లభిస్తాయ్ ఇవి చూడటానికి త్రిశూలము ఆకృతిలో ఉంటాయ్ , పండితులు ఇందులోని మూడు ఆకులు సత్త్వ రజో తమో గుణాలకు ప్రతీక అని చెబుతారు.

మారేడు ఆకుల్ని శివునికి అభిషేక సమయం లో అలంకరణ సమయం లో ఉపయోగిస్తారు, శివునికి ఉపయోగించే కొత్త గా ఆకులు దొరక్క పోయినా పాత ఆకుల్ని తిరిగి కడిగి ఎన్ని సార్లయినా వాడవచ్చు. ఈ నియమం కేవలం మారేడు ఆకులకు మాత్రమే వర్తిస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button