Special Song for Charan and Chiru : రాంచరణ్ పాత్రని మరింత పెంచిన కొరటాల శివ :-

Special Song for Charan and Chiru : మెగా స్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమా ఎపుడో విడుదల అవ్వాల్సింది. కానీ కరోనా కారణంగా మరియు ఆంధ్ర లో టికెట్స్ ఇష్యూ నడుస్తు ఉండటంతో సినిమా విడుదల అవ్వలేదు. అన్ని సమస్యలు తీరిపోయి ప్రజలు థియేటర్స్ కి వచ్చేదాకా ఈ సినిమాని రిలీజ్ చేయరు.
ఇదిలా ఉండగా ఎలాగో రిలీజ్ కి ఇంకా చాల టైం పడుతుంది అని కొరటాల శివ అనుకున్నారేమో. షూటింగ్ అంత అయిపోయిన , సినిమాలో కొత్తగా పాట మరియు సన్నివేశాలు జోడించే పనిలో ఉన్నారని తెలుస్తుంది.
అయితే ఆచార్య సినిమాలో చిన్న పాత్రగా మొదలయిన రాంచరణ్ రోల్ ని ఇప్పటికే సగం సినిమా పైకి చరణ్ ఉండేలా చేశారని అందరికి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇపుడు కొరటాల శివ చరణ్ మరియు చిరు మధ్య ఒక పాట ఉండాలని అనుకున్నారు. అందుకోసం కొత్తగా పాట కూడా రాపించారు. ఇపుడు మరల చిరు మరియు చరణ్ మధ్య పాట చిత్రీకరణ ఉండబోతుంది.
చూడాలి మరి కొరటాల శివ ఇంకెన్ని మార్పులు చేయబోతున్నారో. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు.